కడప జిల్లాలో పోలీసు శాఖ కీలక నిర్ణయం.. ఏం చేశారంటే..

తొలిరోజు అయిన శనివారం 1743 వాహనాలను ఆయా స్టేషన్ల నుంచి తీసుకోగా, ఆదివారం మరో 188 వాహనాలను స్టేషన్ల నుంచి తీసుకెళ్లారు. ప్రత్యేక చొరవ తీసుకుని వాహనాలు అందేలా చర్యలు తీసుకున్నందుకు ఎస్పీ వాహనదారులు ధన్యవాదాలు తెలిపారు.

news18-telugu
Updated: May 24, 2020, 7:46 PM IST
కడప జిల్లాలో పోలీసు శాఖ కీలక నిర్ణయం.. ఏం చేశారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలను తాజాగా తిరిగి ఇచ్చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే లాక్‌డౌన్ నిబంధనల్లో సీజ్ చేసిన వాహనాలను వాహనాదారులకు తిరిగిస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో సీజ్ చేసిన వాహనాల్లో 1931 వాహనాలను పోలీసులు వాహనదారులకు తిరిగిచ్చారు. అయితే వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి ఆయా వాహనాలను విడుదల చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో వాహనాల యాజమానులకు ఆయా స్టేషన్ల నుంచి తీసుకెళ్లారు. తొలిరోజు అయిన శనివారం 1743 వాహనాలను ఆయా స్టేషన్ల నుంచి తీసుకోగా, ఆదివారం మరో 188 వాహనాలను స్టేషన్ల నుంచి తీసుకెళ్లారు. ప్రత్యేక చొరవ తీసుకుని వాహనాలు అందేలా చర్యలు తీసుకున్నందుకు ఎస్పీ వాహనదారులు ధన్యవాదాలు తెలిపారు.
First published: May 24, 2020, 7:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading