జంట హత్యల మిస్టరీని ఛేదించిన పోలీసులు...

గొలుసు నకిలీదని డబ్బులు ఇవ్వడం కుదరదు అన్నందుకు గొడ్డలితో ఇద్దర్ని నరికి చంపాడు ...

news18-telugu
Updated: June 30, 2020, 7:34 PM IST
జంట హత్యల మిస్టరీని ఛేదించిన పోలీసులు...
జంట హత్యల మిస్టరీని ఛేదించిన పోలీసులు
  • Share this:
కామారెడ్డి జిల్లాలో నాలుగు రోజుల్లో జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.. ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్, లక్ష్మయ్య లను బెజ్జంకి విగ్నేష్ కుమార్ అనే యువకుడు డబ్బుల కోసం హత్య చేశాడన్నారు.. విగ్నేష్ ఇంటర్ వరకు చదువుకొని మెడికల్ ఏజెన్సీ లో పని చేస్తున్నాడు.. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు చాలక తేలికగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ లో ఏటీఎం పగలగొట్టి డబ్బులు ఎలా తీయాలో తెలుసుకొని స్థానికంగా ఏటీఎం సెంటర్లో దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యాడు...ఇలా అయితే కుదరదు అని వేరే పన్నాగం పన్నాడు స్థానికంగా ఆర్ ఎం పి గా పనిచేస్తున్న సుధాకర్ వడ్డీకి డబ్బులు ఇవ్వడమే కాక బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడని తెలుసుకున్నాడు.. అలాగే ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ కావడంతో కాస్త పరిచయం కూడా ఉంది.. అది అదను చూసుకొని ఒక గిల్టు చైన్ కొనుక్కొని సుధాకర్ కి ఫోన్ చేసి నా వద్ద బంగారం చేన్ ఉంది..తాకట్టు పెట్టుకుని డబ్బులు కావాలని హత్య ప్రదేశానికి రప్పించాడు.. తన వెంట మద్యంతో పాటు ఒక గొడ్డలి కూడా వెంట తీసుకెళ్లాడు.. ముందుగా ముగ్గురు మద్యం సేవించి చైన్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు విగ్నేష్ ... గొలుసు చూసిన సుధాకర్ నకిలీదని డబ్బులు ఇవ్వడం కుదరదు అన్నాడు.. ఇలాగైతే లాభం లేదనుకున్న విగ్నేష్ గొడ్డలితో ఇద్దర్ని నరికి చంపి సుధాకర్ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నగదు ఫోన్ ని దోచుకెళ్లాడనీ ఎస్పీ శ్వేతా చెప్పారు.. దేవునిపల్లి పోలీసులు పలు టీంలుగా ఏర్పడి అన్ని ఆధారాలు దొరకడంతో విగ్నేష్ ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు.
First published: June 30, 2020, 7:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading