Home /News /crime /

THE PASTOR WHO WENT TO THE TOMB FOR THREE DAYS IN THE STYLE OF A BRAHMAM GARU PRV

Pastor Buried Alive : బ్రహ్మంగారి తరహాలో మూడు రోజులపాటు సమాధిలోకి వెళ్లిన పాస్టర్​.. తరువాత ఏమైందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆఫ్రికాకు చెందిన పాస్టర్‌ 22 ఏళ్ల జేమ్స్(James) సకారా.. తనని తాను దైవం(god) పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్(plan) చేశాడు.

ఇంకా చదవండి ...
  బ్రహ్మంగారి గురించి తెలిసిన వాళ్లు.. చెబుతుంటారు. బతికుండగానే జీవ సమాధి అయ్యారని అంటారు. చరిత్రలో కూడా.. బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబసభ్యులను, శిష్యులను సమావేశపరచి కొద్దిరోజులలో సమాధిలో ప్రవేశించబోతున్నట్లు చెప్పాడట. తన తరువాత, తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించాడట. సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్దయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా ఏడుస్తుండగా, బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరువాత బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడట. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణంను బోధించాడని కథలు కథలుగా చెబుతుంటారు. తాజాగా ఆఫ్రికా(Africa)కు చెందిన ఓ పాస్టర్ (Pastor) కూడా ఇదే అనుకున్నాడు. ‘‘నేను దేవుడి.. బతికుండగానే నన్ను సమాధి చేయండి. మూడు రోజుల తర్వాత జీసస్‌లా ప్రాణాలతో తిరిగి వస్తా..’’ అని తన అనుచరులకు చెప్పాడు. అది నిజమే కాబోలు అనుకుని వారు అతడు చెప్పినట్లే చేశారు. మరి, అతడు మూడు రోజులైన తర్వాత సమాధిని తెరిచి చూసేసరికి అంతా అయిపోయింది.

  జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్(James) సకారా.. తనని తాను దైవం(god) పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్(plan) చేశాడు. తన అనుచరులు వద్దని వారిస్తున్నా.. అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పిక్నిక్ వెళ్లిన ఈజీగా మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు.

  ‘‘ఆ దేవుడి బిడ్డలా నేను నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపాడు. అయితే, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల(4 feets) గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టేసి బతికుండగానే అతడిని పూడ్చిపెట్టేశారు. మూడు రోజుల తర్వాత(3 days later).. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో జనమంతా (all people) అక్కడ గుమిగూడారు.

  చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికి ఉంటాడని భావించారు. కానీ, అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయాడు(died). అయితే, అతడు గాఢ నిద్ర(deep sleep)లో ఉన్నాడని, తప్పకుండా బతుకుతాడంటూ అతడి అనుచరులు ప్రార్థనలు చేశారు. కానీ, జేమ్స్ బతకలేదు. అతడిని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారి(ran waya)లో ఉన్నారు. అయితే, ఇలాంటి ఘటనలు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశ్వాసం ఉండవచ్చు.. కానీ, మూఢ విశ్వాసం ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు.  కాగా, బాబాలు.. స్వామిజీలు బతికుండగానే సమాధిలోకి వెళ్లడం గురించి మీరు వినే ఉంటారు. ఇలా సజీవంగా సమాధి కావడమనేది చాలా భయానకమైన అనుభవం. భూమి అడుగున.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటమంటే నరకంలో ఉన్నట్లే. జీమ్మీ అనే ఓ యూ ట్యూబర్.. ఇటీవలె సమాధిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 50 గంటలు సమాధిలో గడిపి అరుదైన సాహసం చేశాడు. అయితే దానికోసం అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆక్సిజన్​ పైపు సైతం పెట్టుకున్నాడు. పక్కనే వైద్యులు, ఫ్రెండ్స్​ని పెట్టుకుని చేశాడు. కొన్ని గంటల తర్వాత బయటికొచ్చేశాడు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Africa, Buried body, Died, God, God father

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు