Home /News /crime /

THE OLD WOMAN ACTED WITH A SENSE TO CAUGHT THE THIEF EVK

Telangana : అది స‌మ‌య‌స్ఫూర్తంటే.. దొంగ‌ను ప‌ట్టించ‌డానికి వృద్ధురాలు ఏం చేసిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మ‌నం జీవితంలో ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాం. కొన్ని సార్లు ఊహించ‌ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. అలాంటి స‌మ‌యంలో మ‌నం ఎంత మెరుగ్గా స్పందిస్తామో అదే మ‌న స‌మ‌య‌స్ఫూర్తి. అక్క‌డే మ‌న లోక‌జ్ఞానం, తెలివితేట‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింద‌ని తెలియ‌గానే ఓ వృద్ధురాలు వ్య‌వ‌హ‌రించి తీరు దొంగ‌ను ప‌ట్టించాయి.

ఇంకా చదవండి ...
    మ‌నం జీవితంలో ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాం. కొన్ని సార్లు ఊహించ‌ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. అలాంటి స‌మ‌యంలో మ‌నం ఎంత మెరుగ్గా స్పందిస్తామో అదే మ‌న స‌మ‌య‌స్ఫూర్తి. అక్క‌డే మ‌న లోక‌జ్ఞానం, తెలివితేట‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయి. వ‌య‌సులో పెద్ధ‌వారు శారీర‌కంగా బ‌ల‌హీనంగా ఉన్నా వారి ఎంతో అనుభ‌వం తెలివితేటలు వారి సొంతం. అనే విష‌యం మ‌రోసారి రుజువైంది. ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్టు గుర్తించిన ఓ వృద్ధురాలు స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించిన తీరు. దొంగ‌ల‌ను సుల‌వుగా ప‌ట్టించింది. దొంగ‌త‌నం జ‌రిగింద‌ని గుర్తించ‌గానే హైరాన ప‌డ‌లేదు. పోలీసులకు ఫోన్ చేసింది. ఇంట్లో ఏ వ‌స్తువు కూడా ముట్టుకోలేదు.. ఎందుకో తెలుసా.. తాను ఏదైన ముట్టుకొంటే వేలిముద్ర‌లు, దొంగ‌ల ఆన‌వాళ్లు చెదిరిపోతాయ‌ని.. ఆమె స‌మ‌య‌స్ఫూర్తి పోలీసుల‌కు ఎంతో ఉప‌క‌రించింది. దొంగ‌ల‌ను వెంట‌నే ప‌ట్టుకొన్నారు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో కాదు.. హైద‌రాబాద్ (Hyderabad)కేపీహెచ్‌బీలో జ‌రిగింది.

    సెప్టెంబ‌ర్‌లో వినాయ‌క చ‌వితి స‌మ‌యంలో కేపీహెచ్‌బీ (KPHB) నాలుగో ఫేజ్‌లో ఓ వృద్ధురాలు (59) ఇంటికి తాళం వేసి నిజాంపేటలోని త‌న కుమార్తె ఇంటికి వెళ్లి మూడు రోజులు వెళ్లింది. తిరిగి వ‌చ్చే స‌రికి ఇంట్లోని బీరువా తెరిచి ఉంది.

    Fake TET Certificates : నకిలీ టెట్‌ సర్టిఫికెట్లతో టీచ‌ర్‌ ఉద్యోగం.. 36 మందిపై కేసు


    బీరువాలో బంగారు ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు గుర్తించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసి గ‌దిలో ఏ వ‌స్తువును ముట్టుకోలేదు, క‌ద‌ల్చ‌లేదు. దీంతో పోలీసుల‌కు క్లూ సేక‌ర‌ణ సుల‌భంగా ఉంటుంద‌ని తెలిపింది.

    ఫోన్ వాడ‌డు.. సీసీ కెమెరాల‌కు చిక్క‌డు
    ఘ‌ట‌నా స్థ‌లంలో నిందితుడి వేలిముద్ర‌ల‌ను పోలీసులు సేక‌రించారు. వాటిని పాత నేర‌స్థుల చిట్టాతో పోల్చారు. నిందితుడు ఖ‌మ్మ జిల్లా (Khammam)కు చెంది ప‌సుపులేటి దుర్గాప్ర‌సాద్‌గా పోలీసులు గుర్తించారు. అక్క‌డికి వెళ్లి విచారించ‌గా అత‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కృష్ణా జిల్లా కంచిక‌చ‌ర్ల‌లో ఉన్న‌ట్టు గుర్తించారు. అంతే కాకుండా నిందితుడు 2018లో బైక్ కేసులో అరెస్టు అయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అత‌ను సెప్టెంబ‌ర్ 2019లో విడుద‌ల అయ్యాడు. విడుద‌ల అయిన త‌రువాత మ‌ళ్లీ దొంగ‌త‌నాలు మొద‌లు పెట్టాడు. కేవ‌లం రెండో త‌ర‌గ‌తి చ‌దివిన ఇత‌ను దొంగ‌త‌నం చేసేట‌ప్పుడు సీసీ కెమెరాల్లో ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. ఫోన్ వాడ‌డు. ఎక్కువ‌గా కేపీహెచ్‌బీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ (jubilee hills), సూర్య‌పేట (Suryapet) ప‌రిధిలో దొంగ‌తనాలు చేస్తున్న‌ట్టు గుర్తించారు. నిందితుడి నుంచి 5 తులాల బంగారం, 5 తులాల వెండి సేక‌రించిన‌ట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Crime, Hyderabad crime, Khammam, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు