Home /News /crime /

THE NEW HUSBAND COMPLAINED THAT A WOMAN FROM COIMBATORE WAS ALREADY MARRIED SSR

Newly Married: పెళ్లయిన మూడు నెలలకే భార్య ఇచ్చిన ట్విస్ట్‌ను జీర్ణించుకోలేకపోతున్న భర్త..

యామిని, విఘ్నేష్ పెళ్లి ఫొటో

యామిని, విఘ్నేష్ పెళ్లి ఫొటో

ఈ ఫొటోలో కనిపిస్తున్న పెళ్లి కూతురి పేరు యామిని. ఊరు తమిళనాడులోని నరసింహనాయకన్ క్యాంప్. గత సెప్టెంబర్‌లో ఆమె కోయంబత్తూరు సమీపంలోని కనువాయికి చెందిన విఘ్నేష్ అనే యువకుడిని వివాహం చేసుకుంది.

    కోయంబత్తూర్: ఈ ఫొటోలో కనిపిస్తున్న పెళ్లి కూతురి పేరు యామిని. ఊరు తమిళనాడులోని నరసింహనాయకన్ క్యాంప్. గత సెప్టెంబర్‌లో ఆమె కోయంబత్తూరు సమీపంలోని కనువాయికి చెందిన విఘ్నేష్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అమ్మాయి అందంగా ఉండటంతో ఆమె గతం గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాడో ఏమో గానీ కొత్త కాపురం మొదలుపెట్టి మూడేళ్లు భార్యతో సంతోషంగా ఉన్నాడు. కానీ.. ఇటీవల యామిని ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. ఆమెకు కాల్ చేస్తే స్విఛాప్ వచ్చింది. ఇంట్లో ఆమె బట్టలు, నగలు, ఇంట్లో ఉన్న కొంత డబ్బు కనిపించలేదు. దీంతో.. విఘ్నేష్‌కు అనుమానం వచ్చింది.

    దుడియలూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో విఘ్నేష్‌కు తన భార్య గురించి జీర్ణించుకోలేని విషయం తెలిసింది. యామినికి గతంలోనే పెళ్లయిందని, తనను రెండో పెళ్లి చేసుకుందని తెలిసి విఘ్నేష్ షాకయ్యాడు. యామిని మొదట శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయి విఘ్నేష్‌ను రెండో పెళ్లి చేసుకుంది.

    ఇది కూడా చదవండి: Shameful Incident: ఇదేం చండాలం.. ఇలాంటివే జరుగుతుంటే కరోనా రావడం పెద్ద వింతేమీ కాదు..

    ఇప్పుడు తన వద్ద నుంచి వెళ్లిపోయి మళ్లీ మొదటి భర్తతో యామిని ఉంటున్న విషయం తెలిసి తనను ఆమె మోసం చేసిందని విఘ్నేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసేందుకు ఆమెకు సహకరించిన యామిని తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోయంబత్తూర్‌లో ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

    ఇది కూడా చదవండి: OMG: ఈ నర్స్ ఇంట్లో 500 హై క్వాలిటీ కండోమ్స్.. అన్ని ఎందుకున్నాయో తెలిసి షాకయిన పోలీసులు

    యామిని నిర్వాకం తెలిసిన వారంతా విస్తుపోతున్నారు. ఇదే పని ఒక యువకుడు చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని కొందరు మగ నెటిజన్లు నిలదీస్తున్నారు. యామినిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, మరొక మగాడి జీవితం అన్యాయం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు. కూతురు తప్పుదోవ తొక్కుకుంటే సరికాదని చెప్పాల్సిన ఆమె తల్లిదండ్రులు కూడా యామిని చేస్తున్న తప్పులో భాగం కావడం శోచనీయం. తమకు పెళ్లైన విషయాన్ని తెలియజేస్తూ విఘ్నేష్ ఫొటోలు, ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. కేవలం ఈజీ మనీ కోసమే యామిని ఇలా రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని విచారణలో తేలింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Coimbatore, Crime news, Husband, Marriage, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు