Home /News /crime /

THE NALGONDA HEADLESS TORSO CASE TURNED INTO A CRIME THRILLER AND BECAME A SENSATION IN TWO TELUGU STATES PRV

Horror Crime in Telangana: థ్రిల్లర్​ సినిమాను తలపిస్తున్న ‘‘తలలేని మొండెం కేసు’’.. తల ఒక జిల్లాలో.. మొండెం మరో జిల్లాలో...

crime scene

crime scene

తల లేని మొండెం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా (Horror Crime in Telangana)మారింది. ఏదైనా మర్డర్​ జరిగితే మృతదేహం స్వాధీనం చేసుకుని గుర్తుల ద్వారా వారి వివరాలు పసిగట్టడం పోలీసుల డ్యూటీ. కానీ, ఇక్కడ ఏకంగా మొండెం మిస్​ అవడం కలకలం రేపింది.

ఇంకా చదవండి ...
తల లేని మొండెం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా (Horror Crime in Telangana)మారింది. ఏదైనా మర్డర్​ జరిగితే మృతదేహం స్వాధీనం చేసుకుని గుర్తుల ద్వారా వారి వివరాలు పసిగట్టడం పోలీసుల డ్యూటీ. కానీ, ఇక్కడ ఏకంగా మొండెం మిస్​ అవడం కలకలం రేపింది. అందులోనూ ఓ తల అమ్మవారి గుడిలో లభించడం మరింత సంచలన సృష్టించింది. మూడు రోజులుగా తలకు సంబంధించిన మొండెం కోసం 170 మంది పోలీసులు నల్లగొండ, ఇతర జిల్లాల్లో అడుగడుగునా గాలించారు. చివరకు ఓ ప్రదేశంలో మొండెం కనుగొన్నారు. అయితే మొండెం దొరికిన ప్రదేశానికీ ఓ కథ ఉండటంతో ఈ కేసు మలుపులు తిరుగుతోంది. క్రైమ్​ థ్రిల్లర్​ (Horror Crime in Telangana)ను తలపిస్తోంది.

నల్లగొండ (Nalgonda)లోని చింతపల్లి మండలం, విరాట్‌నగర్‌లో మహంకాళి అమ్మవారి విగ్రహం వద్ద ఓ తలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, తలలేని మొండాన్ని గురువారం రంగారెడ్డి  (Ranga reddy) జిల్లా తుర్కయాంజల్‌ సమీపంలోని బ్రాహ్మణపల్లి రోడ్డులో ఓ ఇంట్లో పోలీసులు గుర్తించారు. మొండేన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక ఆధారాల మేరకు హత్యకు గురైన వ్యక్తి సూర్యాటపే జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌ తండాకు చెందిన రమావత్‌ జహేందర్​ నాయక్‌ (30)గా నిర్ధారించారు.

ఆరు నెలలుగా అదే ఇంట్లో..?

జయేందర్‌ నాయక్‌ (Jahendar naik) కు మతిస్థిమితం లేకపోవడంతో ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులు తోడుండేవారు. ఏడాది క్రితం తుర్కయాంజాల్‌కు వచ్చిన ఆతడు ఇక్కడే ఉంటానని చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు కొద్దిరోజులు కొడుకుతో పాటు ఉండి వెళ్లిపోయారు. అతడు భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. మొండెం లభించిన భవనంలోనే గత ఆరు నెలలుగా రాత్రిపూట తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ ఇంటికీ ఓ కథ..

సగం కట్టి వదిలేసిన ఇంట్లో మొండెం లభించగా, ఆ ఇల్లు మిర్యాలగూడకు చెందిన కేశవనాయక్‌దిగా పోలీసులు గుర్తించారు. పోస్టల్‌ డిపార్టుమెంట్‌లో పని చేసి ఇతడు 2018లో హత్యకు గురయ్యాడు. దీంతో నిర్మాణ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటిపై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఈ ఇంటి అమ్మకంపై సైతం గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో  జయేందర్‌ మరణానికి, ఇంటి యజమానికి కేశవనాయక్‌ హత్య, ఆ ఇంటి అమ్మకం గొడవలకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మృతుడు జయేందర్‌ మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు పేర్కొంటున్నారు.

నరబలిగా అనుమానం..

నరబలి అనంతరం చింతపల్లి నుంచి తుర్కయంజాల్‌కు తలలేని మొండాన్ని తరలించారా? లేక, నిర్మాణంలో ఆగిన ఇంట్లోనే హత్య చేసి తలను చింతపల్లికి తరలించారా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని పెట్రోల్‌ పంపులు, మార్బుల్స్‌ దుకాణాలతో పాటు రహదారిపై ఉన్న ఆరు చోట్ల సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు.

హత్య వెనుక ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మొండెం వద్ద లభించిన దుస్తులు, ఇతర ఆధారాలతో మొండెం జయేందర్‌ దేనని అప్పట్లో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడి, తల్లిదండ్రుల డీఎన్‌ఏ నమూనాలను పరీక్షకు పంపించినట్లు తెలిసింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Murder case, Nalgonda, Ranga reddy, Telangana crime

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు