THE MOTHER WHO CUT THE CHILDS THROAT WITH THE BLADE FINALLY THE MOTHER ALSO COMMITTED SUICIDE VB MBNR
TS Crime: బ్లేడ్ తో చిన్నారి గొంతు కోసిన తల్లి.. చివరకు తల్లి కూడా ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
TS Crime: భార్యభర్తల మధ్య గొడవలో తన కుమార్తెను బ్లేడ్ తో గొంతు కోసి చంపేసింది ఓ తల్లి. క్షణికావేశానికి మూడేళ్ల చిన్నారి బలైంది. అంతేకాకుండా ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గ్రామస్తులు ఈ విధంగా తెలిపారు.
(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)
వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. వాళ్లకు నలుగురు సంతానం. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారం భార్యభర్తల మధ్య గొడవ తీవ్ర విషాదాన్ని నింపింది. కొడుకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనే విషయంపై భార్యభర్తలు మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. భర్త మీద కోపంతో కొడుకును బ్లేడ్ తో గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత విషయాన్ని భర్తకు చెప్పి ఆమె కూడా బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని ఫుల్ మామిడిలో చిన్నారి గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుమారుడి పుట్టినరోజు నిర్వహణపై భర్తతో గొడవ పడిన భార్య మూడేళ్ల చిన్నారి గొంతు కోసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పులిమామిడి లో చోటు చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం ..
గ్రామానికి చెందిన రమేష్, మంజుల దంపతులకు నలుగురు సంతానం. వీళ్ళ జీవితం సాఫీగా సాగేది కానీ కొంతకాలంగా మంజుల మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంది. చిన్న చిన్న విషయాలకు భర్త తో పాటు వారి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుంది. పెద్ద కుమారుడు శివ కుమార్ పుట్టిన రోజు వేడుకల ఏర్పాటు విషయంలో భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన మంజుల తన భర్త షేవింగ్ చేసుకుంటున్న బ్లడ్ తో చిన్న కుమార్తె శివాని(3) గొంతు కోసింది.
ఈ విషయం భర్తకు చెప్పి ఆమె గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.