Telangana: అమానుష ఘటన.. కన్నపేగును వదిలించుకున్న తల్లి.. ముళ్ల పొదల్లో ఏడుస్తూ కనిపించిన పసికందు.

పాపను చేరదీసిన గ్రామస్తులు

Nirmal: పొలం పనులపై వెళ్తున్న ఓ మహిళకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. వెనుకకు తిరిగి చూసింది. ఎవరూ లేరు. అలాగే ముందుకు రెండు అడుగులు వేసింది. మరల అదే ఏడుపు.. ఏంటా అని అక్కడ చుట్టు పక్కల వెతకగా పొదల్లో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ ఏడుస్తూ కనిపించింది. ఎవరో అక్కడ వదిలి వెళ్లిపోయినట్లు గ్రహించి గ్రామస్తులకు సమాచారం అందించింది.

  • Share this:
    ఆడపిల్ల పుట్టిదంటే తమ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చిందని కొంతమంది మురిసిపోతుంటే, ఆ ఆడపిల్ల భారమని భావించి వదలించుకుంటున్నావారు మరికొందరు ఉన్నారు. అయితే ఇందులో రెండో కోవకు చెందిన వారో లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కాని ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానుష ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళుతున్న ఓ మహిళ పసికందు ఏడుపు వినిపించడంతో దగ్గరికి వెళ్ళి చూడడంతో పొదలమాటున ఆడ శిశువు కనిపించింది. ఈ విషయం గ్రామస్థులకు చెప్పడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. తర్వాత గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

    పసికందును చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెట్ల పొదలో పసికందు పడిఉన్నదన్న విషయం తెలిసిన గ్రామస్థుల ఆ శిశువు చూసేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

    ఆ పసికందును పొదల పాలు చేసిన ఆ కసాయి తల్లిపై శాపనార్ధాలు పెట్టారు. ఓ వైపు ప్రభుత్వం భేటి బచావో భేటి పడావో అనే నినాదంతో ఆడపిల్లల సంరక్షణకు పలు కార్యక్రమాలను అమలుచేస్తుంటే మరోవైపు అప్పుడే కళ్ళు తెరిచి ఈ భూప్రపంచంలో అడుగుపెట్టిన పసికందును వదిలించుకునే ప్రయత్నాలు చేస్తుండటం పలువురిని కలిచివేస్తోంది.
    Published by:Veera Babu
    First published: