Home /News /crime /

‘అమ్మా లే అమ్మా.. చెల్లి ఆడుకుందాం రా.. అంటూ..’ తల్లీ, చెల్లి మృతదేహం వద్ద ఆ చిన్నారి రోధన.. ఆ దృశ్యాలు..

‘అమ్మా లే అమ్మా.. చెల్లి ఆడుకుందాం రా.. అంటూ..’ తల్లీ, చెల్లి మృతదేహం వద్ద ఆ చిన్నారి రోధన.. ఆ దృశ్యాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లీ కూతుళ్లు ప్రమాదవశాత్తు చెరువులో పడి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న పెద్ద కూతురి రోధన ప్రతీ ఒక్కరినీ కన్నీరుపెట్టించాయి. వివరాల్లోకివెళ్తే..

ఇంకా చదవండి ...
  సిద్దిపేట (Siddipeta) జిల్లాలో దసరా(Dussehra) పండుగ (Festival) రోజు దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ(Bathukamma) పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక(Dubbaka) మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ఈ విధంగా ఉన్నాయి. దుబ్బాక మండల ఎనగుర్తి గ్రామానికి చెందిన భారతమ్మ , మల్లయ్య దంపతుల చిన్న కూతురు రోజాకు 10 సంవత్సరాల కిందట మిరుదొడ్డి (Mirudoddi) మండలం వీరారెడ్డిపల్లికి చెందిన చెప్యాల నరేష్‌ ( Naresh) తో వివాహం జరిగింది. వీరికి రేష్మిక (8), చైత్ర(5) ఇద్దరు కూతుళ్లున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నరేష్ చనిపోయాడు.

  Saffron Flower Benefits: గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడతాడా..! ఉపయోగాలేంటి..


  బతుకమ్మ పండుగ సందర్భంగా 25 ఏళ్ల రోజా తన పుట్టింటికి తన పిల్లలతో కలిసి వచ్చింది. ఉదయం స్థానిక బండకుంట చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు రోజా తన కూతుళ్లను వెంట తీసుకెళ్లింది. ఆమె బట్టలు ఉతకడానికి చెరువులోకి దగింది. తన ఇద్దరు కూతుళ్లను చురువుగట్టున ఉండి ఆడుకొమ్మని చెప్పింది. చిన్న కూతరు చైత్ర చెరువు గట్టుపై నుంచి ఆడుకుంటూ జారుగకుంటూ చెరువులో పడిపోయింది. పెద్ద కూతురు రేష్మిక కేకలు వేయటంతో తల్లి రోజా గమణించింది. తన చిన్న కూతురు మునిగిపోతుండగా.. ఆమె తన చీరను ఇచ్చింది. కానీ చైత్ర ఆ చీరను అదుకోలేకపోయింది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్లింది రోజా.

  Road Accident: పండగ పూట విషాదం.. వేర్వేరు ప్రదేశాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..


  ఆ చీరను ఇస్తున్న క్రమలో ఆమె కూడా చెరువులో మునిగిపోయింది. ఇక బయట నుంచి ఆమె పెద్ద కూతురు రేష్మిక తల్లి, చెల్లి కనిపించకపోవడంతో అరవడం మొదలు పెట్టింది. ఆమెతో పాటు అక్కడే ఉన్న మరికొంతమంది ఏడుస్తూ కనిపించారు. ఎంతకూ వాళ్ల అమ్మ, చెల్లి బయటకు రాకపోవడంతో ఏడ్చుకుంటూ వెళ్లి ఆమె తన అమమ్మ ఇంట్లో చెప్పింది. వారితో పాటు చుట్టుపక్కల వారు చెరువు వద్దకు వెళ్లారు. గజ ఈతగాళ్ల సహాయంతో తల్లీకూతుళ్ల మృతదేహాలను బయటకు తీశారు.

  పండగకు సంతోషంగా వచ్చిన కూతురు, మనువరాలు తిరిగిరాని లోకాలకు వెళ్లటం పట్ల రోజా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  Cab Driver: క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. కోపంతో ఆ డ్రైవర్ ఏ చేశాడో తెలుసా..


  అమ్మ, చెల్లి మృతదేహాల వద్ద పెద్ద కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు తండ్రి కూడా లేకపోవడంతో రష్మిక ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. అక్కడ రష్మిక ఏడుపులు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ‘నాకు అమ్మ కావాలి.. లే అమ్మా అంటూ’ ఆమె ఏడుపూ హృదయవిదారకరంగా ఉంది. చెల్లి చెయ్యి పట్టుకొని.. రా చెల్లి .. ఆడుకుందాం అంటూ ఆమె రోధించింది. ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరికీ కంటతడి పెట్టించాయి.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Siddipeta

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు