Home /News /crime /

THE MINOR GIRL AND A MARRIED MAN COMMITTED SUICIDE TOGETHER WHEN THE ADULTS REFUSED TO MARRY FOR LOVE MBNR PRV

Mahbubnagar: వివాహితుడిని ప్రేమించిన 15 ఏళ్ల బాలిక.. పెద్దలు అంగీకరించకపోవడంతో చివరికి..

ఇరువురి మృతదేహాలు

ఇరువురి మృతదేహాలు

ఓ మైనర్​ బాలిక వరుసకు బావ అయిన యువకుడిని ప్రేమించింది. అయితే అతనికి అప్పటికే పెళ్లి అయింది. కాగా, ఆ యువతితో జీవితం పంచుకోవాలనుకుని ఆ వివాహితుడు పెద్దల దగ్గరికి వచ్చాడు

    (News 18, మహబూబ్ నగర్, సయ్యద్ రఫీ)

    ఓ మైనర్​ బాలిక (Minor girl) వరుసకు బావ అయిన యువకుడిని ప్రేమించింది. అయితే అతనికి అప్పటికే పెళ్లి (married) అయింది. కాగా, ఆ యువతితో జీవితం పంచుకోవాలనుకుని ఆ వివాహితుడు (married man) పెద్దల దగ్గరికి వచ్చాడు. ఈ విషయం ఇరువైపులా ఇళ్లలో తెలిసి ఇది సరికాదని (Refused) చెప్పారు. దీంతో వేరువేరుగా బతికే కంటే కలిసి చనిపోవాలని నిర్ణయించుకొని ఇద్దరు జలాశయంలో దూకేశారు.  ఈ ఘటన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా (Mahbubnagar) పరిధిలో గల వనపర్తి జిల్లా రేపల్లె మండలం గౌరీ దేవి పల్లి సమీపంలో గుడిపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

    ఆరేళ్ల కిందట పెళ్లి..

    ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... నాగర్ కర్నూల్  జిల్లా పట్టణ సంధ్య నగర్ కాలనీకి చెందిన నరేష్ (25 సంవత్సరాలు) కు అచ్చంపేట గ్రామానికి చెందిన యువతి (girl)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఆరు నెలల పాప కూడా ఉంది. భార్యకు చెల్లెలి వరుసయ్యే కల్వకుర్తి పట్టణానికి చెందిన యువతి ( 15) తో నరేష్ నాలుగు సంవత్సరాలుగా ప్రేమ (Love) వ్యవహారం ఉంది. ఈ విషయం రెండు కుటుంబాలకు గతంలోనే తెలిసి గొడవలు అయ్యాయి. ఇరువైపుల కుటుంబ పెద్దలు నచ్చజెప్పారు. అయితే తమ ప్రేమ (love)ను పెద్దలు అర్థం చేసుకోకపోవడం లేదని భావించిన యువతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు నరేష్ కూడా అదృశ్యం  (Missing) కావడంతో ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇది కూడా చదవండి: ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

    ప్రేమను అంగీకరించడం లేదని..

    ఈ క్రమంలో ఒక్కటిగా కలిసిన ఇరువురు గౌరీ దేవి పల్లి సమీపంలోని గుడిపల్లి జలాశయంలో దూకారు. కాగా, ఒడ్డున ఉన్న సెల్ ఫోన్ లో తమ ఇద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు పంపిన సందేశం ఉంది. నీటిలో గజ ఈతగాళ్లు , పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా రెండు రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టారు.

    మోటార్లతో నీరు తోడటంతో..

    అయితే మృతదేహాలు దొరక్కపోవడంతో ప్రాజెక్ట్ ఇంజనీర్ సహాయంతో శనివారం సాయంత్రం 3 మోటార్ లతో నీటిని బయటికి తోడి౦చి వెతికారు. చివరికి రాళ్ల మధ్య చిక్కుకున్న స్థితిలో మృతదేహాలు లభించాయి. ఎస్ ఐ శ్రీనివాసులు సిబ్బంది గ్రామస్తులు కలిసి  మృతదేహాలను తిప్పల పై ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్ఐ శ్రీనివాసులు  తెలిపారు.

    ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attemp to suicide, Crime news, Lovers suicide, Mahbubnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు