ఒక వివాహేతర సంబంధం.. ఐదుగురు ఆడపిల్లల పరిస్థితి ఎవరూ ఊహించని స్థితికి చేరింది.. అసలేం జరిగిందంటే..

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

Extramarital Affair: కట్టుకున్న భర్త ఉన్నా కొంతమంది మహిళలు వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబసభ్యులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నారు. ఓ వివాహిత ఐదుగురు ఆడపిల్లలున్న సంగతి మర్చిపోయి ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది. దీంతో కటకటాలపాలయ్యింది. అటు తండ్రి లేక.. ఇటు తల్లి జైలు పాలు కావడంతో ఆ ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పూర్తి వివరాలివే..

 • Share this:
  వారిద్దరు దంపతులు. వారికి చిన్నపాటి వ్యవసాయ పొలం ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదుగురు సంతానం. అందులో అందరూ ఆడపిల్లలే. వ్యవసాయంతో పాటు అతడు గొర్రెలను కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇలా అన్యన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ వ్యక్తి పరిచయం కొంప ముంచింది. అతడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కట్టుకున్న భర్తకు ఈ విషయం తెలవడంతో అతడు ఎన్ని సార్లు హెచ్చరించినా ఆమె మాత్రం వినిపించుకోలేదు. అంతే కాకుండా తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించాలని నిర్ణయం తీసకుంది. అంతేకాకుడా ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబానికి అండగా ఉంటుందని బీమా చేయించుకుంటారు జనం. కానీ ఆమె తన భర్తను చంపేస్తే రైతుబీమా డబ్బులు కూడా పొందొచ్చని అనుకుంది. ఈ ప్లాన్ ప్రకారమే.. ఓ రోజు తన ప్రియుడితో తన భర్తను హత్య చేయించింది.

  దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు తీసుకుపోవడంతో వారికి ఉన్న ఐదుగురు ఆడపిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన ఆ గ్రమంలో తీవ్రంగా కలచి వేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. సిద్దిపేట ఏసీపీ సైదులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లికి చెందిన దొందడి రెడ్డయ్య-తిరుపతమ్మ దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు. రెడ్డయ్య తనకున్న రెండెకరాల పొలంలో పంట సాగు చేయడంతోపాటు గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెడ్డయ్య భార్యకు అదే గ్రామానికి చెందిన అఫ్రోజ్‌ అలియాస్‌ అప్పుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. తన భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడు అఫ్రోజ్‌తో సుఖంగా ఉండొచ్చని, అతన్ని చంపేస్తే రైతుబీమా రూ.5 లక్షలు కూడా వస్తాయని భావించింది.

  భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి  మాస్టర్ ప్లాన్ రచించింది. అందులో భాగంగానే ఐదురోజుల క్రితం తమ బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి పిల్లలను వెంట తీసుకెళ్లింది. ఆ మరుసటి రోజు అఫ్రోజ్‌కు తిరుపతమ్మ ఫోన్‌ చేసి, తన భర్తను చంపేయ్‌ అంటూ ఫోన్ చేసి చెప్పిది.  గ్రామ శివారులో దుంపలపల్లి-ధర్మారం రోడ్డులో రెడ్డయ్యకు మద్యం బాగా తాగించి అతడి టవల్‌తోనే రెడ్డయ్య మెడకు ఉరి వేసి హతమార్చాడు.  అటుగా వెళ్లిన గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో దుబ్బాక పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, చాకచక్యంగా తిరుపతమ్మ, అఫ్రోజ్‌ను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
  Published by:Veera Babu
  First published: