ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh). మిగతా రాష్ట్రాల కన్నా మావోల (Maoists) ప్రాభవం చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రం. సరిహద్దులో అడవులు ఎక్కువగా ఉండటం, తెలంగాణ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉండటంతో ఇక్కడ కూడా మావోలు (Maoists) ఉండటంతో కార్యకలాపాలు సులువుగా నడిపిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను మచ్చిక చేసుకుని ఇన్ఫార్మర్లుగా చేసుకుంటున్నారు. అయితే సుక్మా జిల్లాలో మాత్రం మావోలు అనూహ్య ఎత్తుగడ వేశారు. సుక్మా జిల్లాలో ఐదుగురిని మావోయిస్టులు అపహరించారు. జిల్లాలోని కొన్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని బటెర్ గ్రామంపై మావోయిస్టులు (Maoists) శనివారం సాయంత్రం దాడి చేసినట్లు పోలీసులు (police) వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను తమవెంట బలవంతంగా తీసుకెళ్లినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ (Sukma SP Sunil sharma) తెలిపారు. వారిలో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గ్రామంపై ఎందుకు దాడి చేశారు.. బాధితులను (victims) ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలను (searching) ముమ్మరం చేశారని తెలిపారు. గ్రామస్థులను వదిలిపెట్టాలని సర్వా ఆదివాసీ సొసైటీ (Adivasi society) డిమాండ్ చేసింది. వారందరినీ సురక్షితంగా బయటపడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్..
సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను (villagers) తీసుకెళ్తుంటారని.. అదే కారణంతోనే తీసుకెళ్లి ఉండవచ్చని ఎస్పీ సునీల్ తెలిపారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల (release) చేయాలని బస్తర్ రీజియన్‌లోని గిరిజన సంఘాలు ఇప్పటికే మావోయిస్టులను కోరాయని తెలిపారు. భద్రతా దళాలు కూడా సెర్చ్ ఆపరేషన్ (search operation)ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. కొంటా పోలీస్ స్టేషన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు.
జూలైలో నెలలో..
జూలైలో నెలలో జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేడ్ నుంచి ఎనిమిది మంది గ్రామస్థులను నక్సల్స్ (Naxals) అపహరించి తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం రెండు మూడు రోజుల తర్వాత విడుదల చేశారని శర్మ తెలిపారు. అందిన సమాచారం ప్రకారం, మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గ్రామస్తులందరూ బటెర్ గ్రామ నివాసితులు. స్థానిక జర్నలిస్ట్ సలీం మాట్లాడుతూ.. మావోయిస్టులు శుక్రవారం నలుగురు గ్రామస్థులను, శనివారం ఒకరిని అపహరించారని ఇప్పటికీ వారిలో ఎవరూ విడుదల కాలేదని చెప్పారు.
గ్రామస్థుల గురించి ఎలాంటి సమాచారం లేదని..
వీరంతా కొంటా బ్లాక్ (konta block)కి చెందినవారని సుక్మా ఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. సెక్యూరిటీ హెడ్‌క్వాటర్ (security headquarters)కు ఈ గ్రామం 20 కి.మీ దూరంలో ఉందని చెప్పారు. గ్రామస్థుల గురించి ఎలాంటి సమాచారం లేదని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు (Naxals) ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని ఎస్పీ (SP) పేర్కొన్నారు. కిడ్నాప్‌పై వేగంగా దర్యాప్తు చేస్తున్నామని శర్మ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Maoist