Home /News /crime /

THE MAN WHO TOOK THE GIRLFRIEND TO THE HOTEL THE WIFE ALSO REACHED TO CATCH THE HUSBAND RED HANDED SSR

Shocking Incident: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో భర్త హోటల్‌లో ఉన్నాడని తెలిసి.. చంటిబిడ్డను ఎత్తుకుని..

బాధిత మహిళ

బాధిత మహిళ

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వివాహితకు ఆమె భర్త హోటల‌్‌లో ప్రియురాలితో గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. చిన్న వయసున్న పాపను ఎత్తుకుని మరీ ఆ వివాహిత హోటల్‌కు వెళ్లింది.

    ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వివాహితకు ఆమె భర్త హోటల‌్‌లో ప్రియురాలితో గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. చిన్న వయసున్న పాపను ఎత్తుకుని మరీ ఆ వివాహిత హోటల్‌కు వెళ్లింది. తన భర్త అక్రమంగా మద్యం, గంజాయి అమ్ముతూ ఆ వచ్చిన డబ్బుతో ఇలా జల్సాలు చేస్తూ గడుపుతున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఇలా వివాహేతర సంబంధాలు నడుపుతూ తిరుగుతున్నాడని సదరు వివాహిత పేర్కొంది. అయితే.. ఆమె తన భర్తపై రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు కోరారు. కానీ.. ఆమె ఇప్పటివరకూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అవసరమైతే ఫిర్యాదు చేస్తానని ఆ వివాహిత చెప్పడం కొసమెరుపు. ఈ ఘటనతో హోటల్‌లో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. చిన్న పాపతో ఆ మహిళ రావడంతో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు అక్కడున్న కొందరు ప్రయత్నించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Extra marital affair, Husband, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు