(K. Veeranna, News 18, Medak)
ఆటో (Auto)యజమానితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి ఆటో కిరాయి (Auto Rent) తీసుకున్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ (Medak) జిల్లా రామచంద్రపురం (Ramachandra Puram) పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. రామచంద్రాపురం (RC Puram) పట్టణానికి చెందిన వినయ్ కుమార్ (Vinay Kumar) అలియాస్ నాని (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటోను ప్రభు (Prabhu) అనే వ్యక్తి నుంచి కిరాయికి తీసుకుని నడుపుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం డ్రంకెన్ డ్రైవ్లో పటాన్చెరు పోలీసులకు పట్టుబడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు (Traffic police) ఆటో పత్రాలను సీజ్ చేశారు. ఈ కేసులో వినయ్ కుమార్ కోర్టుకు (Court) హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రభు బావమరిది ఆనంద్ తన బావ ఆటో పత్రాల గురించి తెలుసుకున్నాడు. చలాన్లపై నిలదీశాడు. నిర్లక్ష్యంగా చలాన్లు (Challans) కట్టకుండా తిరుగుతున్న వినయకుమార్ పై కక్ష పెంచుకున్నాడు. రామచంద్రాపురంకు చెందిన ఆనంద్ (Anand)తన స్నేహితులు సునీల్య, యశ్వంత్, మహేందర్ తో కలిసి వినయ్ కుమార్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు.
రైల్వేస్టేషన్ సమీప అండర్ బ్రిడ్జ్ వద్ద..
అందులో భాగంగా ఈనెల 2 తేదీన రాత్రి 9 గంటల సమయంలో వినయ్ కుమార్, అతని స్నేహితుడు సాయికృష్ణ (Sai krishna) కలిసి ఆటో(Auto)లో వెళ్తున్నారు. అయితే వారిని ఆనంద్. స్నేహితులు అడ్డుకున్నారు. బలవంతంగా తెల్లాపూర్ (Tellapur) రైల్వేస్టేషన్ సమీప అండర్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ మద్యం సేవిస్తూ వినయ్ కుమార్ను తీవ్రంగా కొట్టారు (Brutally beaten). సాయికృష్ణను గాయపరిచారు. దీంతో వినయ్ కమార్ చనిపోయాడు (Died). అనంతరం వారు ఆటో తీసుకొని పరారయ్యారు.
పోలీసుల తనిఖీల్లో..
ఇదే సమయంలో బుధవారం ఉదయం తెల్లాపూర్ అండర్ బ్రిడ్జి (Tellapur Under bridge) సమీపంలో పోలీసులు (Police) వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆనంద్, సునీల్, యశ్వంత్, మహేందర్ ఆటోలో వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయట పడింది. అయితే పోలీసులు (Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
మృతదేహాన్ని (Dead body) పోస్టు మార్గం నిమిత్తం పటాన్చెరు (Patancheru) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్ఎస్ఐ శశికాంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ గోపికృష్ణా రెడ్డి, సత్యనారాయణ, కాని స్టేబుళ్లు విక్రమ్. భవానీ ప్రసాద్, మధు కర్. సత్యనారాయణ, మహేష్ కుమార్, ప్రకాష్, ప్రవీణ్ కుమార్, సంతోషను ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ సంజయ్ కుమార్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Brutally murder, Crime news, Medak