అతడు కరడుగట్టిన నేరస్తుడు. ఉత్తరాఖండ్‌లో గ్రామ పెద్దను కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులకు చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్‌కు వచ్చాడు. అతడు హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటున్నాడో పోలీసులకు తెలిసిపోయింది. కానీ సీన్ కట్ చేస్తే.. మళ్లీ అతడు తప్పించుకున్నాడు. పోలీసుల కళ్లలో కారం కొట్టి పారిపోయాడు. ఇలాంటివి చాలా సినిమాల్లో చూశాం. ఇతడి క్రైమ్ కథ కూడా అచ్చం అలానే ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అసలేం జరిగింది? పోలీసుల నుంచి రెండుసార్లు ఎలా తప్పించుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2019లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా గంగ్నహార్ ఠాణా పరిధిలో ఓ హత్య జరిగింది. గ్రామ పెద్ద కామ్రేను దుండుగులు హత్య చేశారు. ఆ కేసులో వాసీం అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. కామ్రేను చంపేసిన తర్వాత.. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని వాసీం భయపడిపోయాడు. పక్కా ప్లాన్‌తో పోలీసుల కళ్లుగప్పి తన భార్య షమీంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చేశాడు. పోలీసులేమో అంతా గాలించారు. కానీ ఎక్కడా దొరకలేదు. వాసీంను పట్టించిన వారికి రూ.10వేలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఐనా అతడి గురించి ఎలాంటి క్లూ దొరకలేదు.
ఐతే ఇటీవలే వాసీం గురించి ఉత్తరాఖండ్ పోలీసులు ఖచ్చితమైన సమాచారం అందింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భార్యతో పాటు నివసిస్తున్నాడని ఓ వ్యక్తి ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. అతడిని పట్టుకునేందుకు ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎస్ఐ బిల్వర్ సింగ్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. మంగళవారం ఈ ముగ్గురు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వాసీ గురించి వారికి వివరించి.. తమకు సాయం చేయాలని కోరారు. ఈ కేసులో మీకు సహకరిస్తామని రాజేంద్ర నగర్ పోలీసులు హామీ ఇచ్చారు. మొత్తం ఆరుగురు పోలీసులు మంగళవారం రాత్రి వాసీం ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఐతే తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలిసి.. వాసీ ఇంటి లోపలికి పరుగెత్తాడు. రెండు చేతుల్లో కారం పొడి పట్టుకున్నాడు. ఆ లోపు అతడి భార్య, మరో మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఇంటి లోపలి నుంచి బయటకు వచ్చిన వాసీం పోలీసుల కళ్లల్లో కారం పొడి చల్లి పారిపోయాడు. ఈ ఘటనలో ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ చమన్కుమార్, రాజేంద్రనగర్ కానిస్టేబుల్ ఫయాజ్ కళ్లలో కారం పడి ఇబ్బంది పడ్డారు.
పోలీసులపై దాడి చేసి పారిపోయిన వాసీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక నిందితుడు పారిపోయేందుకు సహకరించడంతో పాటు పోలీసుల విధి నిర్వహణలో ఆటంకం కలిగించినందుకు వాసీం భార్య షమా పర్వీన్‌ను అరెస్ట్ చేసి ఉత్తరాఖండ్‌కు తరలించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.