పెద్దలకు చికెన్.. పిల్లలకు చిప్ప్ ఇవ్వలేదని.. క్వారంటైన్‌లోని వ్యక్తి ఏం చేశాడంటే..

భోజనం అందిస్తున్న ఆశా కార్యకర్త రేణుకుా నాగప్పను తనకు చికెన్, చేపకూరతో భోజనం ఏర్పాటు చేయాలని కోరాడు. పిల్లలకు చిప్స్ ఇవ్వాలంటూ తెలిపాడు.

news18-telugu
Updated: May 24, 2020, 4:51 PM IST
పెద్దలకు చికెన్.. పిల్లలకు చిప్ప్ ఇవ్వలేదని.. క్వారంటైన్‌లోని వ్యక్తి ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి వేరే ప్రాంతం నుంచి గ్రామానికి రావడంతో అతడితో పాటు కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. అయితే క్వారంటైన్‌లో భాగంగా భోజనం అందిస్తున్న ఓ అశా కార్యకర్తకు పెద్దలకు చికెన్, చేపలు.. చిన్నపిల్లలకు చిప్ప్ ఇవ్వలేదన్న కోపంతో దాడికి దిగాడు. దీంతో ఆ ఆశా కార్యకర్త చేయి విరిగింది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు వచ్చాడు. దీంతో అధికారులు ఆ వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులను జిల్లాలోని ఆళంద కిణ్ణి అబ్బాస్ గ్రామంలో క్వారంటైన్ చేశారు. అయితే క్వారంటైన్‌లో ఉన్న వారికి అధికారులే భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమనాథ సోనకాంబళె.. వారికి భోజనం అందిస్తున్న ఆశా కార్యకర్త రేణుకుా నాగప్పను తనకు చికెన్, చేపకూరతో భోజనం ఏర్పాటు చేయాలని కోరాడు.

పిల్లలకు చిప్స్ ఇవ్వాలంటూ తెలిపాడు. అయితే ఆశా కార్యకర్త స్పందిస్తూ.. ఉన్నతాధికారులు చెప్పిన భోజన మెనూనే ఇస్తున్నామని, చికెన్, చేపలు ఇవ్వడం కుదరదంటూ తెలిపింది. దీంతో సోమనాథ ఆవేశంతో ఆశాకార్యకర్త రేణుకపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ఎడమ చేయి విరిగింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 24, 2020, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading