హోమ్ /వార్తలు /క్రైమ్ /

LOL: ఈ గ్రామంలో రోజూ సాయంత్రం రెండుమూడు గంటలు కరెంట్ పోయేది.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

LOL: ఈ గ్రామంలో రోజూ సాయంత్రం రెండుమూడు గంటలు కరెంట్ పోయేది.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రహస్యంగా లవర్‌ను కలిసేందుకు ఆమె ఇంటికి పవర్ కట్ చేసి చీకట్లో ఆమెను కలిసేందుకు ప్రయత్నించడం, ఆమె బెడ్రూంలోకి వెళ్లేందుకు నిచ్చెనలు ఎక్కుతూ, ఇంటి పైకప్పు పెంకులు పీకుతూ హీరో నానా పాట్లు పడుతుండే సీన్లు సినిమాల్లో చూస్తుంటాం.

పూర్ణియా: రహస్యంగా లవర్‌ను కలిసేందుకు ఆమె ఇంటికి పవర్ కట్ చేసి చీకట్లో ఆమెను కలిసేందుకు ప్రయత్నించడం, ఆమె బెడ్రూంలోకి వెళ్లేందుకు నిచ్చెనలు ఎక్కుతూ, ఇంటి పైకప్పు పెంకులు పీకుతూ హీరో నానా పాట్లు పడుతుండే సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. ఈ ప్రేమికుడు విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి కావడంతో తన ప్రియురాలిని కలవాలని ఆమె ఇంటికి వెళ్లేందుకు ప్రతిరోజూ చీకటి పడే సమయానికి ఊరి మొత్తానికి పవర్ కట్ చేసేవాడు. ఆమెను కలిసి వెళ్లాక మళ్లీ ఆ ఊరికి కరెంట్ వచ్చేది. సినిమాల్లో అంటే రీల్ లైఫ్ కాబట్టి హీరో సేఫ్‌గా హీరోయిన్‌ను కలిసి ఇంటికెళ్లిపోతాడు. రియల్ లైఫ్‌లో అలా ఉండదు కద.

రోజూ చీకటి పడగానే కరెంట్ పోతుండటం, పక్క ఊర్లలో కరెంట్ ఉంటుండటం, రోజూ పవర్ కట‌్‌తో విసిగిపోయిన గ్రామస్తులకు అనుమానం వచ్చి నిఘా పెట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన వితంతు ప్రియురాలిని కలిసేందుకు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి రోజూ పవర్ కట్ చేస్తున్నట్లు గ్రామస్తులకు తెలిసింది.

ఇది కూడా చదవండి: Sad: అయ్యో పాపం.. భర్త ఇంకా ఇంటికి రాలేదేంటని కాల్ చేస్తే బయటే రింగ్ అయింది.. తీరా చూసేసరికి..

ఒకరోజు సరిగ్గా ఆ వ్యక్తి పవర్ కట్ చేసే సమయానికి ఆ ఊరి యువకులు అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. గుండు కొట్టించి అర్ధనగ్నంగా ఊరంతా ఊరేగించారు. అంతేకాదు, ఆ మహిళతో అతనికి పెళ్లి జరిపించారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని గణేష్‌పూర్ అనే గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం రోజూ ఒకే సమయంలో గ్రామంలో కరెంట్ పోయేదని, రెండు నుంచి మూడు గంటల పాటు గ్రామంలో కరెంట్ పోయేదని ఆ గ్రామంలోని కొందరు చెప్పారు. తొలుత కరెంట్ కోతలు అనుకోని పెద్దగా పట్టించుకోలేదని.. కానీ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కరెంట్ ఉంటూ తమ గ్రామంలోనే రోజూ కరెంట్ పోవడం, అదీ ఒకే సమయానికి రెండు నుంచి మూడు గంటల పాటు కరెంట్ పోతుండటంతో అప్పుడు అనుమానం వచ్చిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Doctor: ఇతనో డాక్టర్.. ఏం చేశాడో తెలిస్తే కడుపు రగిలిపోతుంది.. ఇలా తయారవుతున్నారేంటో రోజురోజుకీ..

అలా నిఘా పెట్టగా.. తమ గ్రామంలో విద్యుత్ శాఖ ఉద్యోగిగా పోస్టింగ్ తీసుకున్న వ్యక్తే ఈ పని చేస్తున్నట్లు తెలిసిందని, తమ గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ భర్త చనిపోయి ఇంట్లో ఒంటరిగా ఉంటోందని, ఆమెను కలిసేందుకు ఇతను ఇలా ఊరంతా కరెంట్ తీస్తున్నట్లు తెలిసిందని గ్రామస్తులు వెల్లడించారు. కరెంట్ తీసేశాక ఆ ఇద్దరూ కలిసి ఆ మహిళ ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కలుసుకునేవారని.. అలా కలిసిన సమయంలో ఇద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని గ్రామస్తులు చెప్పారు. అతను ఇన్నాళ్లుగా చేసిన తప్పుకు శిక్షగా అతనికి దేహ శుద్ధి చేసి.. ఆ తర్వాత శిరోముండనం చేసి ఊరంతా ఊరేగించామని.. ఆ మహిళతో గ్రామ సర్పంచ్ సమక్షంలో పెళ్లి చేసినట్లు గ్రామస్తుడైన రామ్ ముర్మూ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు ఇప్పటివరకూ అందలేదని.. ఈ ఘటన గురించి తమకు తెలిసిందని.. అయితే ఫిర్యాదు అందితేనే ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు.

First published:

Tags: Bihar, Crime news, Love affair, Lovers, Power cuts

ఉత్తమ కథలు