• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • THE MAN DISAPPEARS OVERNIGHT THE VILLAGERS PANICKED AS THE WITCHCRAFT TOOK PLACE VB

Occult worship Tension: రాత్రికి రాత్రే వ్యక్తి అదృశ్యం.. పడుకున్న చోట క్షుద్రపూజలు.. అసలేం జరిగింది..

Occult worship Tension: రాత్రికి రాత్రే వ్యక్తి అదృశ్యం.. పడుకున్న చోట క్షుద్రపూజలు.. అసలేం జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

Occult worship Tension : గ్రామంలో నిద్రిస్తున్నఓ యువకుడు రాత్రికి రాత్రే అదృశ్యం అయ్యాడు. ఉదయం లేచి చూసే సరికి పడుకున్న వ్యక్తి లేకపోవడం మంచం పక్కనే మిరపకాయలు,ముగ్గు, మనిషి బొమ్మ నిమ్మకాయల కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ప్రపంచం మొత్తం టెక్నాలజీ రంగంలో ముందుకు సాగుతుంది. విద్య, వైద్య, సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఇప్పటికీ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నాడు. ఇప్పటికీ మంత్రాలు.. మాయలు అంటూ మోసాలు జరుగుతునే ఉన్నాయి. కొంతమంది మంత్రగాళ్ల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడుల కలకలం రేపింది. గ్రామానికి చెందిన చీమల సతీష్‌(28) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో కనిపించకుండాపోయాడు. అతను పడుకున్న మంచం పక్కనే పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి కనిపించటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మంచం పక్కన మనిషి బొమ్మ, ముగ్గు గీసారు. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

    గతంలో ఇదే తరహాలో ఒకరు అదృశ్యం అయ్యారు. అయితే ఇప్పటివరకు లభించని ఆచూకీ లభించలేదు. కొత్తగా ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సతీష్‌ కుటుంబీకులు, స్థానికులు అతని కోసం అంతా వెతికారు. అతడు పడుకున్న మంచంలో అతని సెల్ ఫోన్ అలానే ఉంది. కానీ, సతీష్‌ అతని బైక్‌ కూడా కనిపించకుండాపోయింది. దీంతో సతీశ్ పై చేతబడి జరిగిందా ?అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.

    మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన యువకుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ చిన్నవారు. చేతబడి చేసి సతీష్‌ని ఏం చేసి ఉంటారో అని భార్య, తల్లి, బంధువులు రోధిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు