Home /News /crime /

THE MADHYA PRADESH HIGH COURT HAS SAID THAT HAVING A PHYSICAL RELATIONSHIP WITH MINOR WIFE IS A FORM OF RAPE THATS WHY BENCH DENIED BAIL TO HUSBAND PRV

Madhya Pradesh: ‘‘ఆ వయస్సున్న అమ్మాయితో శృంగారం రేప్​ కిందకే వస్తుంది..”: మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు (below 18 years) ఉన్న యువతి (girl)తో శారీరక సంబంధం (sexual affair) ఏర్పరుచుకుంటే అది అత్యాచారం (rape) కిందకే వస్తుందని.. ఒకవేళ తను భార్య అయినా రేప్​ కిందకే వస్తుందని కోర్టు (court) తీర్పు చెప్పింది.

ఇంకా చదవండి ...
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు (below 18 years) ఉన్న యువతి (girl)తో శారీరక సంబంధం (physical relationship) ఏర్పరుచుకుంటే అది అత్యాచారం (rape) కిందకే వస్తుందని.. ఒకవేళ తను భార్య అయినా రేప్​ కిందకే వస్తుందని మధ్య ప్రదేశ్​ హైకోర్టు (Madhya Pradesh high court) తీర్పు చెప్పింది. ఈ కేసులో తన 'భార్య'తో శారీరక సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు (గ్వాలియర్ బెంచ్) బెయిల్ (bail) నిరాకరించింది. అంతేకాకుండా సదరు వ్యక్తిపై అత్యాచార కేసు (rape case) నమోదు చేశారు.

మైనర్​ని పెళ్లి చేసుకోవడంతో..

మైనర్ (minor girl)​ను పెళ్లి చేసుకుని, గర్భవతిని (pregnant) చేశాడనే అరోపణలపై మధ్యప్రదేశ్​కు చెందిన అజయ్​ జాదవ్ (Ajay Jadhav)​పై అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో 2021 జనవరి 31న అజయ్​ను పోలీసులు అరెస్టు చేశారు.  IPC సెక్షన్లు 363, 376, 366 , POCSO చట్టంలోని సెక్షన్ 5/6 కింద నేరం కింద కేసులు నమోదు చేశారు. దీంతో అజయ్​ జాదవ్​ తన బెయిల్ (bail)​ కోరుతూ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. అయితే అతను దాఖలు చేసిన నాలుగు బెయిల్​ (bail) పిటిషన్లను న్యాయస్థానం (court) ఇప్పటికే కొట్టివేసింది. తాజాగా ఐదో బెయిల్​ పిటిషన్​ను కొట్టివేస్తూ గ్వాలియర్​ బెంచ్​ తీర్పు చెప్పింది.

నాలుగో బెయిల్​ పిటిషన్​లో..

గతంలో జాదవ్​ దాఖలు చేసిన నాలుగో బెయిల్​ పిటిషన్​ (fourth bail petition)లో తన క్లయింట్​ యువతి (minor girl)ని వివాహం (marriage) చేసుకున్నాడని, అందువల్ల అతనికి బెయిల్ మంజూరు చేయాలని జాదవ్​ తరఫు న్యాయవాది కోరారు. ఆమె మేజర్​ అయిన తర్వాతే శారీరక సంబంధం పెట్టుకున్నారని జాదవ్​ తరఫు న్యాయవాది వాదించారు. న్యాయస్థానం యువతి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. యువతి తండ్రి (girl father) సాక్ష్యాన్ని పరిశీలించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం యువతి గర్భవతి అయ్యే సమయానికి ఆమెకు 17 సంవత్సరాల 6 నెలలుగా నిర్ధారించారు.

రాష్ట్రం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఆసుపత్రి నివేదిక ప్రకారం.. సెప్టెంబరు 16, 2020న యువతి ఒక బిడ్డ (baby)కు జన్మనిచ్చిందని, దీంతో ఆమె డిసెంబర్ 2019 నెలలోనే గర్భవతి (pregnant) అయినట్లు స్పష్టమైందని తెలిపారు. యువతి పుట్టిన తేదీ ఫిబ్రవరి 01, 2002 అయినందువల్ల గర్భవతి అయిన తేదీ నాటికి ఆమె మైనర్ (minor) అని తెలిపారు. దీంతో 31 జూలై 2201న అతని నాలుగో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

గ్వాలియర్​ కోర్టులో ఐదోసారి..

అనంతరం జాదవ్​ గ్వాలియర్​ కోర్టులో ఐదోసారి బెయిల్​ దరఖాస్తు చేసుకున్నాడు. అక్టోబరు 21న అతని ఐదవ బెయిల్‌ను విచారించిన GS అహ్లువాలియా బెంచ్ కూడా అతని బెయిల్​ పిటిషన్​ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

జస్టిస్ జి.ఎస్. అహ్లువాలియా ధర్మాసనం ఈ తీర్పును వెల్లడిస్తూ..  ఇండిపెండెంట్​ థాట్​ వర్సెస్​ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్​ అనదర్​ రిపోర్టెడ్​ ఇన్​ (2017) 10 SCC 800 (Independent Thought Vs. Union of India and another reported in (2017) 10 SCC 800) కేసు సమయంలో సుప్రీంకోర్ట్ IPC సెక్షన్ 375 లోని మినహాయింపు 2 నిబంధనను చదివి వినిపించిందని తెలిపారు. అంతేకాకుండా మైనర్ (Minor)  భార్యతో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే అనగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతితో శృంగారం (physical relationship) రేప్ కేటగిరీలోకి వస్తాయని సుప్రీం తెలిపిందని వివరించారు. అందుకే యువకుడికి బెయిల్​ను నిరాకరిస్తున్నట్లు (bail denied) న్యాయమూర్తి వెల్లడించారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: High Court, Madhya pradesh, Minor girl, Rape case

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు