Home /News /crime /

THE LOVERS WERE MEETING IN THE DARK NIGHT SOMEONE DIALED THE NUMBER 100 HERE IS WHAT HAPPENED NEXT SSR

Lovers: చీకట్లో లవర్‌ను కలిసేందుకు ఆమె ఇంటి వెనుకకు వెళ్లాడు.. ఆ టైంలో ఊహించనిది జరిగింది..

దుర్యోధన సాహా, బసంతి కుమారి

దుర్యోధన సాహా, బసంతి కుమారి

ప్రేమించుకునే సమయంలో పెద్దలకు తెలియకుండా కొందరు లవర్స్ సీక్రెట్‌గా కలుస్తుంటారు. ఎవరి కంట్లో పడకుండా ఉండాలని మరికొందరు లవర్స్ రాత్రుళ్లు అందరూ నిద్రపోయాక కలిసి మాట్లాడుకుంటుంటారు. A lover-girlfriend considered it appropriate to meet in the dark of night. But, when the villagers saw, immediately dialed 100 and informed the police.

ఇంకా చదవండి ...
    పాకూర్: ప్రేమించుకునే సమయంలో పెద్దలకు తెలియకుండా కొందరు లవర్స్ (Lovers) సీక్రెట్‌గా కలుస్తుంటారు. ఎవరి కంట్లో పడకుండా ఉండాలని మరికొందరు లవర్స్ రాత్రుళ్లు అందరూ నిద్రపోయాక కలిసి మాట్లాడుకుంటుంటారు. అలా ప్రియురాలిని కలిసేందుకు అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడిని గ్రామస్తులు గమనించడంతో ఈ లవర్స్ ప్రేమ (Love) వ్యవహారం పెళ్లికి దారితీసింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్‌ పరిధిలో వెలుగుచూసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకూర్ ప్రాంతంలోని దేవ్‌పూర్ గ్రామానికి చెందిన దుర్యోధన సాహా, బసంతి కుమారి అనే యువతీయువకుడు ప్రేమించుకున్నారు. కొన్ని నెలలుగా వీళ్లు ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయట కలుసుకుంటూ.. సినిమాలకు, షికార్లకు వెళుతున్నారు.

    అయితే.. ఇద్దరూ ఎంతసేపు కలిసి ఉన్నా రోజూ అర్ధరాత్రి ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెను బయటకు పిలిచి మాట్లాడి రావడం దుర్యోధన సాహాకు అలవాటు. ఆ అర్ధరాత్రి మాటలే ఈ ఇద్దరి ప్రేమ గురించి గ్రామస్తులకు తెలిసేలా చేశాయి. ఎప్పటిలానే.. గత మంగళవారం దుర్యోధన బసంతిని కలిసేందుకు అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటి వెనుకకు వెళ్లాడు. ఆమె కూడా అతనిని కలిసేందుకు ఇంట్లో వాళ్లకు తెలియకుండా సైలెంట్‌గా బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్లంతా నిద్రపోతున్నారు. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాన్ని గ్రామంలోని కొందరు యువకులు చూశారు. చూసిన వెంటనే.. 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అర్ధరాత్రి అక్కడికి వచ్చి చూసేసరికి దుర్యోధన సాహా, బసంతి కుమారి చాటుగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇద్దరినీ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. యువతీయువకుడి కుటుంబాలకు సమాచారం అందించారు. పోలీసులు ఏం చేద్దామని ఇరు కుటుంబాలను, బసంతిని, దుర్యోధన సాహాను అడిగారు.

    ఇది కూడా చదవండి: Married Woman: మేనత్త కొడుకుపై మోజు పడ్డ మరదలు.. అప్పటికే ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు.. మరో ట్విస్ట్ ఏంటంటే..

    రెండేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని.. పెళ్లి (Marriage) చేసుకుంటామని ఇద్దరూ చెప్పడంతో పోలీసులు ఇరు కుటుంబాలతో మాట్లాడారు. వాళ్లిద్దరూ మేజర్లని.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు వాళ్లకు ఉందని పెద్దలకు అర్థమయ్యేలా చెప్పారు. పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్ (Police Station) సమీపంలో ఉన్న ఆలయానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం బసంతికి, దుర్యోధన సాహాకు పెళ్లి చేశారు. అయితే.. పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఈ లవర్స్‌ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపడం గమనార్హం.

    పెళ్లి చేశాక వధూవరులను (Newly Wed Couple) పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆశీర్వదించారు. ఈ ఘటన పాకూర్ (Pakur) జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది. హిరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పెళ్లి జరిగింది. చాలామంది స్థానికులు ఈ వధూవరుల ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం విశేషం. కానీ.. వీళ్లిద్దరూ ఇలా అర్ధరాత్రి కలుస్తూ.. ఇలా గ్రామస్తులు చూసి 100కి కాల్ చేయడం.. ఈ రీతిలో వీళ్ల పెళ్లి కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Love marriage, Lovers, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు