THE LOVE STORY OF FATHER IN LAW AND DAUGHTER IN LAW ENDED ON SUICIDE SSR
Affair: భార్య చనిపోయింది.. మేనల్లుడి భార్యతో యవ్వారం నడిచింది.. చివరకు ఇద్దరికీ ఈ చెట్టే మిగిలింది..
ప్రతీకాత్మక చిత్రం
సమాజంలో కొందరు మనుషులు వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు, హత్యలకు పాల్పడుతున్నారు. కొందరు గుట్టుగా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ ఆ విషయం బయటపడిన రోజున పరువుపోయిందని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
బిలాస్‌పూర్: సమాజంలో కొందరు మనుషులు వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు, హత్యలకు పాల్పడుతున్నారు. కొందరు గుట్టుగా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ ఆ విషయం బయటపడిన రోజున పరువుపోయిందని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పర స్త్రీ, పర పురుషుడి వ్యామోహంలో పడి కాపురాలను చేజేతులా పాడు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహా ఘటనే.. ఛత్తీస్‌గర్‌లోని బిలాస్‌పూర్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ జిల్లా బెల్హా తాలూకాలోని కనేరి గ్రామానికి చెందిన ఖేలూ రామ్ కేవత్(50), అతని మేనల్లుడి భార్య గీతా(35) కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఖేలూరామ్ గ్రామంలో వ్యవసాయం చేస్తుండగా.. అతని మేనల్లుడి కుటుంబం కూడా అదే గ్రామంలో ఉంటుండేది. ఖేలూరామ్, గీతా సంబంధం గురించి ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో.. ఇద్దరూ కలిసి ఊరొదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. గత మార్చిలో ఇద్దరూ ఊరు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. ఇద్దరూ అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో, ఏం చేస్తున్నారో ఎవరూ పట్టించుకోలేదు.
కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సరిగ్గా.. మూడు రోజుల క్రితం ఖేలూరామ్, గీతా సొంత గ్రామంలోని పొలాల్లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని శవాలుగా కనిపించారు. గ్రామస్తులు వారిద్దరినీ ఆ స్థితిలో చూసి షాకయ్యారు. ఈ జంట ఆత్మహత్యలపై పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. ఇద్దరి అఫైర్ గురించి తమకు తెలిసి మందలించామని.. ఇకపై ఇలా చేయవద్దని చెప్పామని.. తమ మాట పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. చేసిన తప్పుకు పశ్చాతాపంతో ఈ ఇద్దరూ సొంతూరుకి వచ్చి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. స్పాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ పోలీసులకు దొరకలేదు.
గీతకు ఇద్దరు పిల్లలు. ఒకరి వయసు ఆరేళ్లు, మరొకరి వయసు నాలుగేళ్లు. గీత భర్త కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమయంలోనే మేనల్లుడి కుటుంబానికి ఖేలూ రామ్ అండగా ఉన్నాడు. వాళ్ల పొలంలో పనులు కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఈ సమయంలోనే గీతతో అతనికి చనువు పెరిగింది. కానీ.. మేనల్లుడి భార్యతో అఫైర్ పెట్టుకునేంత వరకూ ఖేలూరామ్ వెళతాడని ఎవరూ అనుకోలేదు. ఖేలూరామ్‌కు కూడా ఐదుగురు సంతానం. చాలా ఏళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. గీత కనీసం తన పిల్లల గురించి ఆలోచించకుండా మరొకరితో అఫైర్ కొనసాగించడం.. చివరకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు చిన్నారులు కన్నతల్లిని కోల్పోయారు. ఆ పిల్లలను చూసుకునే స్థితిలో కూడా తండ్రి లేకపోవడం మరింత శోచనీయం.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.