క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరేమో అనే భయంతో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య (love couple committed suicide) చేసుకుంది. ఈ సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా గేట్ వనంపల్లి వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్ పేట మండలం కడ్చర్ల గ్రామానికి చెందిన పల్లె యాదయ్య కుమారుడు పవన్ (18), ఓ యువతితో కలిసి ఔరంగాబాద్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు ధారూర్ మండలం ఎబ్బనూరు గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. హైదరాబాద్ కొంపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి మైనర్ కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అనే భయంతో ఆత్మహత్య (Lovers suicide) చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవాళ వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలలో తెలంగాణలో ఆరుగురు మృతిచెందారు. హైదరాబాద్ శివారులో, వరంగల్ జిల్లాలో జరిగిన బైక్ యాక్సిడెంట్స్ లో నలుగురు యువకులు, ఓ యువతి దుర్మరణం చెందారు. ప్రమాదవశాత్తు మియాపూర్‌లో ఓ వ్యక్తి చనిపోయాడు.
భవనం పై నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
హైదరాబాద్‌లోని (Hyderabad) మియాపూర్ పోలీస్ స్టేషన్ (Miyapur Police station) పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software employee) మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సందీప్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మియపూర్ దీప్తిశ్రీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి సందీప్ కిందపడిపోయాడు. బిల్డిండ్ పై నుంచి పడ్డ సందీప్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు (Died). అయితే అతని ల్యాప్ ట్యాప్ (Laptop) కూడా పైనుంచి కిందపడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా? ఆత్మహత్యా? లేదా ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియడం లేదు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా మియాపూర్ (Miyapur) పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలితీసుకుంది. ఖిలా వరంగల్ మండలంలోని నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డుపక్కన ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. బైక్ పై అతివేగంతో వచ్చిన యువకులు లారీని గమనించలేకపోయారు. దీంతో బైక్ లారీ వెనకవైపు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై బైక్ పై ఇద్దరు యువకులు, ఓ యువతి వెళుతుండగా ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వున్న ముగ్గురు దుర్మరణం చెందారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో బైక్ ను ఢీకొట్టిన వాహనమేదో ఎవరూ గమనించలేదు. బైక్ ను ఢీకొన్న తర్వాత వాహనాన్ని ఆపకుండా పరారయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Lovers suicide, Vikarabad