పల్లెటూర్లలో ఎక్కువగా రాత్రి 7 గంటలు అయిందంటే దాదాపు అందరూ నిద్రపోతారు. బయట దాదాపు ఎవరూ కనిపించరు. ఇక ఇంట్లో కుటుంబసభ్యులు అందరూ పడుకున్న తర్వాత టాయిలెట్(Toilet) కు వెళ్లాలంటేనే బయపడతారు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే.. ఆ గ్రామంలో రాత్రి 7 గంటలు అవుతుంది. ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఎవరూ ఎక్కడా కనిపించడం లేదు. ఓ ఇంట్లో వాళ్ల కుటుంబసభ్యులు అంతా నిద్రపోయారు. ఆ ఇంటికి సంబంధించి ఓ యువతి బాత్రూంకు (Bathroom) వెళ్లేందుకు బయటకు వచ్చింది. అక్కడ ఆమెకు ఓ అనుకోని ఘటన చోటు చేసుకుంది. కేకలు, అరుపులు వినిపించాయి. ముందు వాళ్ల కుటుంబసభ్యులు బయటకు వచ్చి చూశారు. తర్వాత ఏమై ఉంటుంది అని చుట్టుపక్కల వారు బయటకు వచ్చారు.
ఆ ఘటన చూసి అందరూ షాక్ అవ్వడంతో పాటు.. భయాందోళకు కూడా గురయ్యారు. ఆ యువతిని ఓ చిరుతపులి ఈడ్చుకుంటూ వెళ్లిపోతోంది. ఆ గ్రామస్తులు భయంతో ఇంట్లోకి వెళ్లి.. కత్తులు, గడ్డపారలు, బరిసెలు, కర్రలు పట్టుకొని ఆ పులి వెంటపడ్డారు. ఆ తర్వాత ఏమైందంటే.. పూర్తి వివరాల్లోకి తెలుసుకుందాం.. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో జాబలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక ఆ గ్రామంలో 26 ఏళ్ల పూజ బాత్రూంకి వెళ్లేందుకు రాత్రి 7 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. ఆ ఇంటి సమీపంలోనే ఓ పులి కాచుకొని కూర్చుంది. ఎవరు దొరుకుతారా.. అని ఆకలితో వేయిట్ చేస్తోంది. ఆమె బయటకు రాగానే వెంటనే నోటితో పట్టుకొని.. ఈడ్చుకొని వెళ్లడం మొదలు పెట్టింది. వెంటనే ఆ యువతి పెద్దగా అరుపులు, కేకలు వేయడంతో ముందుగా అతడి తండ్రి బయటకు వచ్చి చూశాడు.
తన తండ్రి వచ్చే సరికే చిరుతపులి పూజను ఈడ్చుకుంటూ వెళ్తోంది. భయంతో తన తండ్రి గట్టిగా కేకలు వేయడంతో గ్రామంలో ఉన్న వాళ్లు ఏమైందా అని బయకు వచ్చి చూశారు. ముందుగా కాస్త భయపడిపోయిన గ్రామస్తులు ఆమెను కాపాడటం కోసం కత్తులు, కటారులు వెంటపెట్టుకొని వెంబడించారు. దీంతో ఆ పులి ఆమెను వదిలేసి పారిపోయింది. ఈ ఘటనలో ఆమె చిన్నపాటి గాయాలతో బయటపడింది.
భూమిపై నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో.. చావు అంచుల దాక వచ్చి ఆమె బతకడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఇక ఈ ఘటన తర్వాత గ్రామస్తుల్లో భయాందోళనలు ఎక్కువ అయ్యాయి. ఆ పులి అక్కడే చుట్టుపక్కల తిరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో హడలిపోతున్నారు. ఈ విషయం ఆ గ్రామ సర్పంచ్ వరకు తీసుకెళ్లడంతో అతడు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆ చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Himachal Pradesh