Home /News /crime /

THE LANDLORD KILLED A PERSON WHO IS OLD TENANT IN HIS HOUSE BY CUTTING HIS THROAT WITH SCISSORS ON THE ROAD ADB PRV

Murder on road: ఒకప్పుడు కిరాయికి ఉన్న వ్యక్తిని రోడ్డుపైనే గొంతు కోసి హత్య చేసిన యజమాని.. అసలేం జరిగింది? ఎందుకు చేశాడు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్షణికావేశంలో… కొందరు బలవన్మరణాలకు పాల్పడితే… మరికొందరు కక్షలు కార్పణ్యాలతో హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది

    బలవన్మరణాలు…. హత్యలు… ఇటీవల కాలంలో ఎక్కడోచోట రోజు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్షణికావేశంలో… కొందరు బలవన్మరణాలకు పాల్పడితే… మరికొందరు కక్షలు కార్పణ్యాలతో హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అందరు చూస్తుండగానే రహదారి పక్కనే ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తెరతో పొడిచి హత్యకు (Brutally murder) పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు. అయితే ఈ హత్యోదంతానికి అక్రమ సంబంధమే (Extramarital affairs) కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి నిర్మల్ డీఎస్​పీ ఉపేంద్రా రెడ్డి తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

    ఇద్దరి మధ్య పాత గొడవలు..

    నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గాజులపేట కు చెందిన జుబేర్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తుంటాడు. అయితే ఈ యువకుడు ఇంతకుముందు పట్టణంలోని గంజ్ బక్ష్ ప్రాంతంలో ఉండే ఫయాజ్ (Fayyaz)అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆ ఇద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయని, ఆ గొడవలను మనసులో పెట్టుకొని జుబేర్  (Zubair)ను హతమార్చాలని నిర్ణయించుకున్న ఫయాజ్ అదును చూసుకొని స్థానిక బైల్ బజార్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న జుబేర్ పై దాడికి పాల్పడ్డారు.

    వివాహేతర సంబంధమే..?

    వెంట తెచ్చుకున్న బట్టలు కత్తిరించే కత్తెర (Scissors)తో జుబేర్ గొంతు కోశాడు. దీంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారి బాధితుడు మృతి చెందాడు. అయితే వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసి ఉంటుందన్నఅనుమానాలను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

    గతంలో ఏపీలోనూ ఇలాగే రోడ్డుపై హత్య జరిగింది.  కాకినాడలోని ప్రతాప్ నగర్‌కు చెందిన రాముకి మరియ అనే మహిళతో వివాహేతర సంబంధముంది. ఈ విషయంలో మరియ తండ్రి ఇద్దర్నీ ఎన్నిసార్లు వారించినా వినిపించుకోలేదు. మరియ తండ్రి స్థానికంగా వాచ్‌మెన్‌గా చేస్తున్నాడు. ఐతే ఇటీవల రాము మద్యం తాగి వచ్చి మరియను నిత్యం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రాముపై ఆమె తండ్రి మరింత కోపం పెంచుకున్నాడు. శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాముపై అతడు కాపుగాసి కర్రతో దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. పట్టపగలు నడిరోడ్డుపైనే ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

    ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు. అక్రమ సంబంధం మానుకోమని ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోవడంతోనే.. ఈ దారుణానికి పాల్పడట్లు నిందితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Brutally murder, Crime news, Nirmal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు