THE KILLER KILLED A WOMAN WHO WAS HAVING AN EXTRAMARITAL AFFAIR WITH HIM IN A FOREST NEAR MEDAK AND CALLED THE POLICE MDK PRV
Crime Love story: అడవిలో ఇద్దరూ ఏకాంతంగా గడుపుదామనుకున్నారు.. అంతలోనే ఇరువురిని చూసిన ఓ బాటసారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
వారిరువురిదీ వివాహేతర సంబంధం. ఆ ఇద్దరూ ఏకాంతంగా గడపడం కోసమని అడవిలోకి వెళ్లారు. అయితే ఆ అడవిలో ఓ వ్యక్తి హఠాత్తుగా ఎదురుపడటంతో ఇద్దరికీ ఒణుకు వచ్చేసింది.
వారిరువురిదీ వివాహేతర సంబంధం (extramarital affair). ఆ ఇద్దరూ ఏకాంతంగా గడపడం కోసమని అడవిలోకి (Forest)వెళ్లారు. అయితే ఆ అడవిలో ఓ వ్యక్తి హఠాత్తుగా ఎదురుపడటంతో ఇద్దరికీ ఒణుకు వచ్చేసింది. ఎందుకంటే ఆ వ్యక్తికి సదరు మహిళ (Woman) పరిచయం. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఓ మర్డర్ (Murder) జరిగింది. ఇంతకీ ముగ్గురిలో చనిపోయింది ఎవరు? ఎవరు చంపారు? వివరాల్లోకి వెళితే..ఈ ఘటనలో మహిళ (Woman was killed) చనిపోయింది. మహిళ హత్య (Woman murder)కు దారి తీసిన సంఘటన చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్ అటవీప్రాంతంలో (Edippal Forest) చోటుచేసుకుంది. హంతకుడే మెదక్ పోలీసులకు సమాచారం అందించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో పాపన్నపేట మండలం ఏడుపాయల అటవీప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టారు. ఎట్టకేలకు హంతకుడి ఫోన్ ట్రేస్ చేసిన పోలీసులు చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని (Woman dead body) గుర్తించారు.
ఏం జరిగింది?
మెద 9Medak)క్ మండలం ముగ్దూంపూర్ గ్రామానికి చెందిన కుర్మ సాయవ్వ (Kurma Sayavva) అదే గ్రామానికి చెందిన ఆర్‌టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఎల్లోల్ల కిషన్ (Ellola Kishan) వివాహేతర సంబంధం (extramarital affair) నెరుపుతున్నారు. అని బైక్‌పై మెదక్ నుంచి చిన్నశంకరంపేట వైపు వచ్చారు. మెదక్–చేగుంట రహదారిపై పక్కన ఎస్.కొండాపూర్ గ్రామ శివారులోని ఏడిప్పల్ అటవీప్రాంతంలో (Edippal Forest) బైక్‌ను అడవిలోకి మళ్లించారు. వీరు అక్కడ ఉండగానే సాయవ్వకు పరిచయం ఉన్న మరో వ్యక్తి (Another person) అక్కడికి రావడంతో మాటమాట పెరిగింది. అయితే ఈ ఘటనలో ఏం గొడవ జరిగిందో ఏమో కానీ సాయవ్వను చాకుతో హత్య (Murder with Knife)చేసినట్లు ఎల్లోల్ల కిషన్ పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులకు సమాచారం..ఆపై ఫోన్ స్విచ్ఛాఫ్
అయితే నిందితుడు కిషన్ మెదక్ పోలీస్‌లకు (Medak police) ఏడిప్పల్ అటవీప్రాంతంలో మహిళను హత్య (Murder) చేసినట్లు ఫోన్ చేసి చెప్పి (Phone called) వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో పాపన్నపేట మండలం ఏడుపాయల అటవీ ప్రాంతంలో మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్, పాపన్నపేట ఎస్‌ఐ విజయ్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో సరైన సమాచారం లభించకపోవడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు నిందితుడి ఫోన్ ట్రెస్ (Mobile Trace) చేసి వివరాలు సేకరించారు. ఏడిప్పల్ అటవీప్రాంతంలో మృతదేహాన్ని (Dead body) గుర్తించారు. చిన్నశంకరంపేట పోలీసులు (Police) రామాయంపేట సీఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.