వేరొకరితో సెక్స్ చేయాలన్న భర్త.. ఒప్పుకోనన్న భార్య.. షేర్ చాట్‌లో..

ఈ క్రమంలోనే అతడితో వైఫ్ స్వాపింగ్ గురించి చర్చించాడు. వారిద్దరూ ఓ అవగాహనకు రావడంతో అదే విషయాన్ని తన భార్యకు చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇస్తానని బెదిరించి, హింసించాడు.

news18-telugu
Updated: April 30, 2019, 6:01 PM IST
వేరొకరితో సెక్స్ చేయాలన్న భర్త.. ఒప్పుకోనన్న భార్య.. షేర్ చాట్‌లో..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 6:01 PM IST
పాశ్చాత్య సంస్కృతి.. విలువలను కాలరాస్తోంది. కట్టుకున్న బంధాలను, నియమాలను తుంగలో తొక్కుతోంది. భార్యభర్తల బంధానికి కళంకం తెస్తోంది. వైఫ్ స్వాపింగ్.. భార్యల మార్పిడి.. అంటే.. ఒకరి భార్యను మరొకరు ఎక్స్ఛేంజ్ చేసుకోవడం. తమ భార్యలతో కాకుండా మరొకరి భార్యతో శృంగారం చేయడం. ఈ మధ్యే మన దేశంలోకి ప్రవేశించి వేలాది కుటుంబాలను ముంచుతున్న ఈ పాడు చర్య ఇప్పుడు తాజాగా మరో ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను తన భర్త వైఫ్ స్వాపింగ్‌కు బలవంత పెట్టగా, ఇష్టం లేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బట్టబయలైంది.

కేరళలోని అలప్పుజ జిల్లా కయంకుళంలో ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో పని చేసే 32 ఏళ్ల ఓ యువకుడికి షేర్ చాట్ ద్వారా కాలికట్‌కు చెందిన అర్షద్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ క్రమంలోనే అతడితో వైఫ్ స్వాపింగ్ గురించి చర్చించాడు. వారిద్దరూ ఓ అవగాహనకు రావడంతో అదే విషయాన్ని తన భార్యకు చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇస్తానని బెదిరించి, హింసించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఓకే చెప్పాల్సి వచ్చింది. అప్పటి నుంచి తరచూ వైఫ్ స్వాపింగ్‌కు ఆమెను బలవంతపెట్టాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

వైఫ్ స్వాపింగ్‌పై పోలీసులు మాట్లాడుతూ.. ‘గతేడాది మార్చిలో వైఫ్ స్వాపింగ్ ఇక్కడ ప్రారంభమైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నలుగురిని అరెస్ట్‌ చేసి, ఐపీసీ 366 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశాం. అరెస్టైన వారిలో కిరణ్‌, సీది, ఉమేశ్‌, బ్లెసరిన్‌ ఉన్నారు’ అని వెల్లడించారు.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...