Sonu sood: బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ ఇళ్లల్లో తనిఖీలపై ఐటీ శాఖ ప్రకటన.. దాడులు ఎందుకు చేశారంటే?

సోనూసూద్​ (ఫైల్)

ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్​ని బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించింది. అది జరిగిన కొద్ది రోజులకే సోనూసూద్​పై ఐటీ శాఖ (Income tax) అధికారులు దాడులు చేశారు. బోగస్​ లావాదేవీలపై తనిఖీ (search)లు చేపట్టారు. సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై దాడులు నిర్వహించింది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు సోదాలు చేసిన అధికారులు.. దాడులకు సంబంధించి ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు.

 • Share this:
  కరోనా మహమ్మారి తాండవించిన సమయంలో బాలీవుడ్​ నటుడు సోనూసూద్ (Sonu sood) చాలామందికి అండగా నిలిచాడు. వందలాది మందికి సాయం అందించారు. ఈ సేవాగుణం కారణంగా దేశవ్యాప్తంగా (nationwide) ఆయనకు లక్షలాది మంది అభిమానులు (fans) అయిపోయారు. పెద్దపెద్ద సెలెబ్రెటీలు సైతం ఆయనను ప్రశంసించారు. గొప్ప గౌరవం ఇచ్చారు. ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్​ సమయంలో కూడా హీరో చిరంజీవి సినిమాలో సన్నివేశంలో భాగంగా సోనూసూద్​ను కాలితో తన్నాల్సిన సీన్​ ఉంటే దానిని తీసేయించిన సంగతి తెలిసిందే. సోనూసూద్​కు మంచి పేరు ఉందని, ఇలాంటి సీన్లు చేస్తే వారు బాధ పడుతారని చిరు చెప్పిన సంగతి విదితమే. ఇంత ఫాలోయింగ్​ ఉన్న నటుడిపై అప్పుడప్పుడు విమర్శలు, రాజకీయ ఒత్తిడిలు వచ్చాయి. ఫలానా పార్టీకి వ్యతిరేకం అంటూ.. ఫలానా పార్టీకి మద్దతు అంటూ.. ఇక రాజకీయాల్లోకి వస్తారంటూ.. సోషల్​మీడియాలో చర్చలూ వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని సోనూ క్లారిటీ ఇచ్చాడు.

  ఐటీ శాఖ సంచలన దాడులు..

  కాగా, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్​ని బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించింది. అది జరిగిన కొద్ది రోజులకే సోనూసూద్​పై ఐటీ శాఖ (Income tax) అధికారులు దాడులు చేశారు. బోగస్​ లావాదేవీలపై తనిఖీ (search)లు చేపట్టారు. సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై దాడులు నిర్వహించింది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు సోదాలు చేసిన అధికారులు.. దాడులకు సంబంధించి ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు.

  రూ. 1.9 కోట్లు వివిధ సహాయక పనులకు..

  సోనూసూద్ లావాదేవీలు, పన్ను ఎగవేతపై ఐటీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు దాడులు చేసినట్లు తెలిసింది. తనిఖీల్లో రూ .20 కోట్లకు పైగా పన్నులు సోనూసూద్​ ఎగవేసినట్లు (Evaded tax) బయటపడిందని  ఆదాయపు పన్ను శాఖ (Income tax) తెలియజేసింది. సోనూకు సంబంధించిన ముంబై (Mumbai), లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ మరియు గుర్గావ్‌లలోని మొత్తం 28 ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. 21 జూలై 2020 న సోనూసూద్​ స్థాపించిన ఛారిటీ ఫౌండేషన్ 01.04.2021 నుంచి ఇప్పటి వరకు 18.94 కోట్ల రూపాయల విరాళాలను (Donations) సేకరించిందని, అందులో దాదాపు రూ. 1.9 కోట్లు వివిధ సహాయక పనులకు, మిగిలిన రూ. 17 కోట్లు ఫౌండేషన్ బ్యాంక్ ఖాతాలో నిరుపయోగంగా (Unused) ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది.

  బోగస్​ రుణాలతో ఆస్తులు..

  సోనూసూద్‌ ఆర్థిక లావాదేవీలతో పాటు.. సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను (bank Accounts) కూడా ప‌రిశీలించారు. 11 లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు (Officials).. కోటీ 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత కోసం ఖాతాల పుస్తకాలలో ప్రొఫెషనల్ రసీదులను రుణాలుగా చూపించారని చెప్పారు. బోగస్ రుణాలు పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తులను సంపాదించడానికి ఉపయోగించారని ఐటీ అధికారులు తెలిపారు. సోనూసూద్​, అతని సహచరుల ఇళ్లల్లో ఐటీ శాఖ తనిఖీల సమయంలో, పన్ను ఎగవేత (Not paying tax)కు సంబంధించిన నేరపూరిత ఆధారాలు కనుగొన్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో అలాంటివి ఇరవై ఎంట్రీలు సందేహాస్పదంగా ఉన్నాయని వారు తెలిపారు.

  ఆ చట్టాన్ని ఉల్లంఘించారంటూ..

  ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని (FCRA) ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు.  పన్ను ఎగవేత (not pay tax) కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా మభ్యపెట్టారని అధికారులు వెల్లడించారు.

  దాడులపై అభిమానుల విమర్శలు..

  సోనూసూద్ కంపెనీకి, లక్నో రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య జరిగిన  రూ. 175 కోట్లు అగ్రిమెంట్‌పై ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందంలో సోనూసూద్ పన్ను ఎగవేశారని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. ఐతే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు చేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. సోనూసూద్‌ ఆమ్ ఆద్మీ పార్టీలో చేర‌తార‌నే.. ఆయ‌న ఇళ్లు, కార్యాలయాల‌పై ఐటీ దాడులు చేస్తున్నారని మండి ప‌డుతున్నారు. అభిమానులు కూడా సోనూ సూద్​ ఇళ్లపై ఐటీ దాడులను ఖండిస్తున్నారు. సోషల్​మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే సోనూసూద్​ ఎంత పన్ను ఎగ్గొట్టినా అది పేదలకే పంచాడని అభిమానులు వాదిస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published: