Home /News /crime /

THE INCIDENT WHERE THE FATHER IN LAW HACKED THE DAUGHTER IN LAW TO DEATH NEAR TIRUPATI HAS CAUSED SHOCK SSR

Shocking: ఆర్మీలో భర్త.. ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్‌కు మరొకరితో అఫైర్.. ఆమె మామ ఏం చేశాడంటే..

నిందితుడు మణి, హత్యకు గురైన మురుగమ్మల్

నిందితుడు మణి, హత్యకు గురైన మురుగమ్మల్

ఆమె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవానుగా దేశానికి సేవలందిస్తున్నాడు. అయితే.. ఆ టీచర్ మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం ఆమె భర్తకు తెలియడంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇంకా చదవండి ...
    తిరుపత్తూరు: ఆమె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవానుగా దేశానికి సేవలందిస్తున్నాడు. అయితే.. ఆ టీచర్ మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం ఆమె భర్తకు తెలియడంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అయితే.. ఊహించని రీతిలో ఆ జవాను భార్య హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా నటరామ్‌పల్లి గ్రామానికి చెందిన శివ(40) ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు.

    2009లో ఆయన మురుగమ్మల్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఎనిమిదేళ్లు, పదకొండు సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కలర్పతి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మురుగమ్మల్ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న విషయం ఆమె భర్త శివకు తెలిసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అయితే.. విడాకులు కోరినప్పటికీ మురుగమ్మల్ ఆమె మెట్టినింట్లోనే ఉంది. దీంతో.. ఆ ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలని, ఆ ఇల్లు తనదని శివ తండ్రి మణి కోడలికి తెగేసి చెప్పాడు.

    మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న కోడలు తన ఇంట్లో ఉండటానికి వీల్లేదని మురుగమ్మల్‌కు ఆమె మామ చెప్పాడు. ఈ విషయంలో మామాకోడలి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకానొక దశలో వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని ఆమె మామ మురుగమ్మల్ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్పాట్‌లోనే కుప్పకూలి చనిపోయింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే.. మణి తానే బైక్‌పై వెళ్లి తన కోడలిని చంపానని లొంగిపోయాడు. పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మురుగమ్మల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Extra marital affair, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు