బీహార్‌లోని జమూయి జిల్లాలో ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.
జమూయి: బీహార్‌లోని జమూయి జిల్లాలో ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జమూయి జిల్లాలోని చంద్రదీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంపో గ్రామానికి చెందిన వికాస్ కుమార్ అనే యువకుడు ఆరు నెలల క్రితం కాజల్ కుమారి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. భార్య అడిగిందేదీ కాదనకుండా ఇచ్చేవాడు. ఇటీవల తన భార్యతో కలిసి అత్త గారింటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు యువకులు కాజల్‌తో మాట్లాడేందుకు ఆమె ఇంటికొచ్చారు.
ముగ్గురూ బాగా చనువుగా ఉంటూ ఉండటం వికాస్‌కు నచ్చలేదు. అయితే.. ఆ వచ్చిన ఇద్దరిలో కాజల్ ప్రియుడు కూడా ఉండటం ఈ కేసులో పెద్ద ట్విస్ట్. తన భర్తను చంపించే ఉద్దేశంతో అతను ఎవరో ప్రియుడికి చూపించేందుకు కాజల్ కుమారి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఆ మరుసటి రోజు బయటకు వెళ్లిన వికాస్ ఎంతసేపవుతున్నా తిరిగి రాలేదు. దీంతో.. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంతగానో వెతికారు. ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. ఉదయం ఊరి పొలాల్లో వికాస్ మృతదేహం కనిపించింది. ఎవరో అతని గొంతు కోసి చంపినట్టుగా మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
వికాస్ మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. వికాస్ భార్య కాజల్ కుమారి కూడా వికాస్ మృతదేహాన్ని చూసేందుకు అక్కడికి వెళ్లగా గ్రామస్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని చావుకు ఈమెనే కారణమని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో.. అసలు నిజం వెలుగుచూసింది.
భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసినట్లుగా కాజల్ కుమారి పోలీసులకు చెప్పింది. దిఘపర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో తనకు పరిచయం ఏర్పడిందని.. అతనితో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు భర్త అడ్డుగా ఉండటంతో ఈ పని చేసినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. పోలీసులు ఆమెపై, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పెళ్లికి ముందు ఓ యువకుడితో పరిచయం.. వేరొకరితో పెళ్లి తర్వాత కూడా అతనితో అఫైర్ కొనసాగించాలన్న కాజల్ కుమారి ఆరాటం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు పరిచయాలను మరొకరితో పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తే ఎలాంటి పరిణామాలు, అనర్థాలు జరుగుతాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. ఆరు నెలల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆమెను బాగా చూసుకుంటూ సంతోషంగా ఉంటున్న వికాస్ తనకు ఇలాంటి ఒకరోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. భార్య అఫైర్ చివరకు ఓ యువకుడి నిండు ప్రాణం తీసింది. కాజల్ కుమారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.