So Sad: ఆమెకు జరిగిన ఘోరం మరెవరికీ జరగకూడదు.. ఇల్లు ఆశ చూపి.. గ్రామ శివారుకు తీసుకెళ్లి..

పోలీసుల అదుపులో నిందితులు

So Sad: ఇల్లు ఇప్పిస్తామని మోసం చేసి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి కోసం ఆశ పడి ఆమె మరో మహిళతో బటయకు వెళ్లింది. ఇలా బయటకు వచ్చినప ఆమె దగ్గర ఉన్న డబ్బులు, బంగారం తీసుకొని.. ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి.. ఐదుగురు కలిసి హత్య చేశారు.

 • Share this:
  (K.Veeranna,News18,Medak)

  ఇల్లు ఇప్పిస్తామని మోసం చేసి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే నేపథ్యంలో ఓ మహిళ.. మరో మహిళను పరిచయం చేసుకుని ఆమె వద్ద ఉన్న డబ్బులను బంగారం, బంగారు గొలుసు, కడియాలు లాంటి వస్తువులను తీసుకొని నర్సాపూర్ దగ్గర్లో ఉన్న రుస్తుం పేట్ గ్రామ శివారులోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ మరో నలుగురు ఉన్నారు. అక్కడ అందరూ మద్యం సేవించి ఉన్నారు. దీంతో వాళ్లు అతి దారుణంగా ఆమెను చంపేశారు. హత్య చేసిన వారిలో ఐదుగురు ఉన్నారు. ఇందులో ఇద్దరు మగవారు.. ముగ్గురు మహిళలు ఉండడం విశేషం.

  Cab Driver: క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. కోపంతో ఆ డ్రైవర్ ఏ చేశాడో తెలుసా..


  వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు డీఎస్పీ బాలాజీ నాయక్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు విలేకరులు సమావేశంలో ఈ విధంగా వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ని నేతాజీ నగర్ లో అమృత(50) అనే మహిళ అద్దెకు ఉంటోంది. ఆమెకు ఒక కూతురు అమరేశ్వరి ఉంది. గత నెలలో తల్లి కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాడు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఈ నెల 9న ఆమె హత్యకు గురయినట్లు గుర్తించారు.

  School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..


  హత్యచేసిన వాళ్లను కూడా పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. హత్య చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ఒంటరిగా ఉంటున్న అమృత వద్ద ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని స్థానికంగా నివాసం ఉండే ఐదుగురు గత కొంతకాలంగా ఎదురు చూశారు. సమయం కోసం చూసి.. గత నెల ఆమె వద్దకు గీత అనే మహిళ వెళ్లింది. స్నేహితురాలిగా పరిచయం చేసుకొని ఓ రోజు ఉండటానికి మంచి ఇల్లు.. తక్కువ ధరకు చూపిస్తానని ఆమెను తనతో ఆటోలో బయటకు తీసుకెళ్లింది. ఇల్లు కొనడానికి వెళ్తున్నందున ఆమె తనతో పాటు కొంత నగులు, డబ్బులను కూడా ఆమె వెంట తెచ్చుకుంది.

  Shocking: వామ్మో.. ఏందది.. వీడియో చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది.. అస్సలు మీరు మనుషులేనా..


  పథకం ప్రకారం ఆమెను తన ముఠా సభ్యుల వద్దకు తీసుకెళ్లింది గీత. అక్కడే నలుగురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారు. అందులో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. ఆమె దగ్గర ఉన్న నగలు దాదాపు 8 తులాల బంగారం, 40 తులాల వెండి, 70 వేల రూపాయల నగదు తీసుకున్నారు. తర్వాత ఆమెతో బలవంతంగా మొత్తం ఐదుగురు కలిసి మద్యం తాపించారు.

  తర్వాత అత్యంత దారుణంగా హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. హత్యతో సంబంధం ఉన్న గీత (34), అశోక్ (43 ), కుమార్ ( 41), లలిత (59), సౌజన్య (18) లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపాడు. ఐదుగురిని ఈనెల 9న అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిగిందా.. లేదా అనేది వివరాలు తెలియరాలేదు.
  Published by:Veera Babu
  First published: