మద్యం మత్తులో నాలుగో పెళ్లాంతో.. మూడో పెళ్లాం ఇంటికొచ్చిన భర్త...

రాత్రి మద్యం సేవించి నాలుగో భార్యను తీసుకుని.. మూడో భార్య ఇంటికి వెళ్లాడు. సవతితో తన ఇంటికి వచ్చిన భర్తను చూసిన మూడో భార్య అపర కాళికలా మారి భర్తతో గొడవ పడింది. ఇద్దిరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

news18-telugu
Updated: May 31, 2020, 9:46 PM IST
మద్యం మత్తులో నాలుగో పెళ్లాంతో.. మూడో పెళ్లాం ఇంటికొచ్చిన భర్త...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం మత్తులో ఓ వ్యక్తి నాలుగో పెళ్లాంతో కలిసి మూడో పెళ్లాం ఇంటికెళ్లాడు. తీరా తెల్లారి లేచి చూసేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేంటి అనుకుంటున్నారా..?. అవును మీరు చదివింది నిజమే. తాళి కట్టిన ఒక్క భార్యతోనే వేగలేక మగవాళ్లు ఆపసోపాలు పడుతున్నారు. కానీ మధ్యప్రదేశ్‌లోని గోటెగావ్ ప్రాంతానికి చెందిన హేమరాజ్(40)కి మాత్రం ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోగా మిగిలిన ముగ్గురిని మూడు ఊళ్లల్లో పెట్టి భార్యలతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే కాలం కలిసిరాకపోవడంతో మద్యం మత్తులో చేసిన చిన్న తప్పుకు తన జీవితాన్ని చాలించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హేమరాజ్(40)కి నలుగురు భార్యలు. మొదటి భార్య చనిపోగా ముగ్గురు భార్యలను మూడు ఊళ్లల్లో ఉంచి విడతల వారీగా వారివద్దకు వెళ్లి కాపురం చేసి వస్తూ ఉండేవాడు.

రెండో భార్య నర్సింగాపూర్‌లోనూ, మూడో భార్య బగాస్‌పూర్‌లో, నాలుగో భార్య కరేలీలోనూ ఉండేది. అయితే మద్యం సేవించే అలవాటు ఉన్నహేమరాజ్ మే 23వ తేదీ రాత్రి మద్యం సేవించి నాలుగో భార్యను తీసుకుని.. మూడో భార్య ఇంటికి వెళ్లాడు. సవతితో తన ఇంటికి వచ్చిన భర్తను చూసిన మూడో భార్య అపర కాళికలా మారి భర్తతో గొడవ పడింది. ఇద్దిరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో హేమరాజ్ మూడో భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో కోపం వచ్చిన ఆమె భర్తను, తన సవతిని ఇంట్లో వదిలేసి అదే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి పడుకుంది.

ఆదివారం ఉదయం ఇంటికొచ్చి చూసే సరికి భర్త హేమరాజ్ ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతని నాలుగో భార్య కూడా కనిపించకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 31, 2020, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading