డబ్బు మత్తులో భార్యను బలవంతంగా వ్యభిచార ముఠాకు అమ్మేసిన భర్త...

కొంత కాలంగా ఆమెను వ్యభిచారం చేయాలంటూ వేధించసాగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో సలీం ఆమెను తీవ్రంగా గాయపరిచాడు.

news18-telugu
Updated: October 22, 2019, 10:17 PM IST
డబ్బు మత్తులో భార్యను బలవంతంగా వ్యభిచార ముఠాకు అమ్మేసిన భర్త...
ప్రతీకాత్మకచిత్రం
news18-telugu
Updated: October 22, 2019, 10:17 PM IST
డబ్బు మోజులో పడి కట్టుకున్న భార్యను వ్యభిచారం రొంపిలోకి దింపాలని ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నిందితుడు సలీం తన భార్య ఫతీమాను అనే మహిళను కొన్నేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కొంత కాలంగా ఆమెను వ్యభిచారం చేయాలంటూ వేధించసాగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో సలీం ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అంతేకాదు ఆమెను గదిలో బంధించి తిండి, నీరు దొరకకుండా చేశాడు. అనంతరం ముంబై నుంచి వచ్చిన ఓ ముఠాకు స్పృహ కోల్పోయిన తన భార్యను డబ్బు ఇచ్చి తీసుకెళ్లాలని కోరాడు. అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బాధితురాలి బంధువులతో సహా భర్త వేధింపుల గురించి వారికి చెప్పారు. దీంతో పోలీసులు సలీంను అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...