Home /News /crime /

THE HUSBAND WHO COMMITTED SUICIDE SAID THAT HIS WIFE HAD INSULTED THE CHILDREN NOT BEING BORN BN

పిల్లలు పుట్టనందుకు భార్య అవమానించిందని భర్త ఆత్మహత్య

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

రెండు రోజుల క్రితం భార్య మరో మహిళను వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. పిల్లలు పుట్టడం లేదని, పరీక్ష చేయించుకునేందుకు కరీంనగర్ రావాలని అడిగింది.

    ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలోనూ క్రైమ్ రేట్ పెరుగుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎక్కువ శాతం ఇంటికే పరిమితం కావాల్సి రావడం.. అందరూ ఇళ్లలోనే ఉంటుండడం వల్ల పలు రకాల కారణాలతో గొడవలు, గృహహింస పెరిగిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే తాజాగా భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పిల్లలు పుట్టనందుకు భార్య అవమానించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా వెల్లటూరుకు చెందిన శ్రీధర్ అనే యువకుడు 2011లో జల అనే యువతితో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆ యువకుడు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాగుడుకు బానిసయ్యాడు. భర్త వేధింపులు తట్టుకోలేక యువతి 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.

    అయితే రెండు రోజుల క్రితం భార్య మరో మహిళను వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. పిల్లలు పుట్టడం లేదని, పరీక్ష చేయించుకునేందుకు కరీంనగర్ రావాలని అడిగింది. రాకుంటే మాత్రం బాగుండదని బెదిరించి వెళ్లింది. దీంతో మనస్థాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన చావుకు భార్య కారణమని, తన ఆస్తిని, తన తల్లికే ఇవ్వాలని నోటు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Crime news, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు