హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్యకు కరోనా వైరస్ సోకిందని.. భర్త ఎంతపని చేశాడంటే..

భార్యకు కరోనా వైరస్ సోకిందని.. భర్త ఎంతపని చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి(54) తనభార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తాజాగా అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఉన్నట్టుండి ఆ వ్యక్తి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే కొంతమంది కరోనా వైరస్ పట్ల సరైన అవగాహన లేక మానసిక ఆందోళనతో వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి హరియాణాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యకు కరోనా వైరస్ సోకిందని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి(54) తనభార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తాజాగా అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఉన్నట్టుండి ఆ వ్యక్తి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం భార్యకు మాత్రమే కరోనా సోకిందా.. అతడికి సైతం కరోనా వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టానికి ముందు ఈ విషయం తేలుతుందని పోలీసులు చెప్పారు.

First published:

Tags: Coronavirus, Crime news, Haryana

ఉత్తమ కథలు