Telangana Crime: భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించిఉండరు..

ప్రతీకాత్మక చిత్రం

Telangana Crime: మహబూబాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. భర్త పదే పదే తనను చిత్ర హింసలు పెడుతుంటడంతో భార్య ప్రమీల తట్టుకోలేక తన భర్త మర్మాంగాన్ని కోసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  తెలంగాణ(Telangana)లోని మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల(Wife and Husband) మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను అతడి భార్య దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసేసింది. భార్యాభర్తల మధ్య గొడ‌వ‌లు రావ‌డం స‌హ‌జం. కానీ అందులో ఎవరో ఒకరు ఓపికతో ఉండాలి. ఇద్దరు కోపంతో ఉంటే ఊహించని పరిణామాలు చోటు చేసకుంటాయి. అలాంటిదే ఇక్కడ భార్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయింది. దీంతో ఘోరం జరిగిపోయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధి వాంకుడోతు తండాలో భూక్య బీచ్యా – ప్రమీల భార్య భ‌ర్త‌లు నివ‌సిస్తుండేవారు. తాజాగా భార్యాభ‌ర్త‌లు ఇద్దరూ గొడ‌వ ప‌డ్డారు.

  ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్య ఇంత పని చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.. చివరకు..


  ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు విన‌ప‌డ్డాయి. ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను దారుణంగా చంప‌డ‌మే కాకుండా అత‌ని ప్రైవేట్ పార్ట్ (మ‌ర్మాంగం ) కోసి చంపేసింది. భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో భార్య ప్రమీల మర్మాంగం కోసిందని స్థానికులు అంటున్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మరో ఘటనలో ఫుడ్‌కోర్టులోని (food court)మహిళల బాత్రూంలో సెల్‌ఫోన్ కెమెరా వ్యవహారం వెలుగు చూసింది. జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టులో ఈ కేమెరాను గుర్తించారు.

  కాగా నేడు ఫుడ్‌ కోర్టుకు ఓ మహిళ నేపథ్యంలోనే బాత్రూంలో(Bathroom) ఆన్ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు (police)ఫిర్యాదు చేసింది. దించిన పోలీసులు ఫుడ్‌కోర్టులోని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సెల్ ఫోన్ నిన్నటి నుండి ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా బాత్రూంలో కెమెరా పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఫుడ్‌కోర్టులో బాత్రూం క్లీనింగ్ చేసే బెనర్జీ అనే వ్యక్తి ఇందుకు కారణమని పోలీసులు కనిపెట్టారు.

  Teacher-Student: కీచక ఉపాధ్యాయుడు.. 12 ఏళ్ల విద్యార్థినిని అక్కడ కొరికాడు.. తర్వాత ఏమైందంటే..


  దీంతో బెనర్జీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా ఇటివల ఓ మహిళ తన బాత్రూంలో స్నానం చేస్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా తాజాగా ఈ సెల్ కెమెరా కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చిన్నారుల నుండి మహిళల వరకు అత్యాచారాలు జరుగుతుండగా మరోవైపు ఇలాంటీ దుర్మార్గపు చర్యలకు దుండగులు దిగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. అయితే ఇలా ఎన్ని రోజులుగా ఫుడ్ కోర్టులో సెల్ రికార్డింగ్ వ్యవహరం నడుస్తుందో అనే ఆందోళన చెలరేగుతోంది.

  అయితే పోలీసుల అదుపులో ఉన్న బెనర్జీ ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వం వీటిపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.
  Published by:Veera Babu
  First published: