Bhubaneswar: ఎంతటి దారుణం.. ఆర్థిక సమస్యలున్నాయని.. పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త

ప్రతీకాత్మక చిత్రం

అమాయకపు టీనెజర్లను (teenagers) ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి కేటుగాళ్లు పెళ్లిళ్లు చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు (money) తీసుకుని ఉడాయిస్తున్నారు. ఇదే కోణంలో ఇటీవల భువనేశ్వర్​ (Bhubaneswar)లో ఓ ఘటన చోటు చేసుకుంది.

  • Share this:
    ఈ మధ్యలో సోషల్​మీడియా (Social media) వాడకం చాలా పెరిగిపోయింది. ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే చాలామంది తెలిసీ తెలియని వయసులో ఆకర్షణలో పడిపోయి.. సోషల్​ మీడియాలో ప్రేమించేసుకుంటున్నారు. ఆ తర్వాత పెద్దలను ఎదురించి పెళ్లిళ్లు (marriage) చేసుకుంటున్నారు. అయితే ఆన్లైన్​లో ఉన్నంత కాలం బాగానే సాగిన ప్రేమ.. పెళ్లి చేసుకున్నాక కరువవడం.. ఆతర్వాత విడిపోవడాలు.. జరుగుతున్నాయి. అయితే మరో కోణంలో (another angle) చూస్తే మాత్రం అమాయకపు టీనెజర్లను (teenagers) ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి చాలామంది పెళ్లిళ్లు చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు (money) తీసుకుని ఉడాయిస్తున్నారు. ఇదే కోణంలో ఇటీవల భువనేశ్వర్​ (Bhubaneswar)లో ఓ ఘటన చోటు చేసుకుంది. తనకు ఆర్థికంగా సమస్యలున్నాయని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్య (wife)ను అమ్మేశాడు కిరాతకుడు. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

    ప్రేమ పెళ్లి..

    ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్యను అమ్మేశాడో భర్త. ఆర్థిక సమస్యలున్నాయని (Financial problems) పని కోసం రాజస్థాన్‌ (Rajasthan)కు తీసుకెళ్లి.. అక్కడే మరో వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశా (Orissa)లోని బెల్​పాడా పోలీస్‌స్టేషన్​ పరిధి సులేకేలా గ్రామానికి చెందిన మైనర్‌ (17) బొలంగిర్​కు చెందిన యువతితో ఫేస్‌బుక్ (Facebook)​లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ (love)గా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి వారు పెళ్లి (marriage) చేసుకున్నారు.

    ఆర్థిక సమస్యలున్నాయని..

    పెళ్లైన రెండు నెలల (after two months) తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్​పూర్‌ (Raipur) తీసుకెళ్లాడు​. ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌ (Rajasthan)లోని ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ 55 ఏళ్ల వ్యక్తికి రూ.1.8 లక్షలకు తన భార్యను అమ్మేసి అతడి ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్‌లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ (smart phone) కొనుగోలు చేశాడు. అనంతరం యువతి తల్లిదండ్రులకు (parents) ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు.

    అనుమానం వచ్చి..

    అయితే, అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు (family members) బెల్​పాడా పోలీస్‌స్టేషన్ (bell pada police station)​లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకోగా వారికి  గ్రామస్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. రోడ్లను బ్లాక్‌  (blocked roads)చేసి వారిని అడ్డుకున్నారు. అతికష్టమ్మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు (police) ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
    Published by:Prabhakar Vaddi
    First published: