హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: కొడుకుకు తెల్ల దుస్తులు కప్పి ఒక ఫొటో.. కూతురి మెడకు ఉరితో మరో ఫొటో.. ఎందుకో తెలిస్తే..

Shocking: కొడుకుకు తెల్ల దుస్తులు కప్పి ఒక ఫొటో.. కూతురి మెడకు ఉరితో మరో ఫొటో.. ఎందుకో తెలిస్తే..

తెల్ల దుస్తులతో నేలపై పడుకున్న పిల్లాడు, బకెట్‌పై నిల్చున్న బాలిక

తెల్ల దుస్తులతో నేలపై పడుకున్న పిల్లాడు, బకెట్‌పై నిల్చున్న బాలిక

భార్యాభర్తలన్నాక మనస్పర్థలు రావడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం, భర్త సర్ది చెప్పుకుని తిరిగి భార్యను తనతో పాటు తీసుకెళ్లడం చాలా కుటుంబాల్లో జరిగే పరిణామమే. అయితే.. కొందరు భర్తలు తాగి వేధిస్తుంటే వారి తీరుకు విసిగిపోయి పుట్టింటికి వెళ్లే భార్యలు తిరిగి భర్తతో వెళ్లేందుకు ససేమిరా అంటారు.

ఇంకా చదవండి ...

  ముంబై: భార్యాభర్తలన్నాక మనస్పర్థలు రావడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం, భర్త సర్ది చెప్పుకుని తిరిగి భార్యను తనతో పాటు తీసుకెళ్లడం చాలా కుటుంబాల్లో జరిగే పరిణామమే. అయితే.. కొందరు భర్తలు తాగి వేధిస్తుంటే వారి తీరుకు విసిగిపోయి పుట్టింటికి వెళ్లే భార్యలు తిరిగి భర్తతో వెళ్లేందుకు ససేమిరా అంటారు. అలా.. తనతో కలిసి రాని భార్యను రప్పించేందుకు ఓ భర్త సైకోలా ప్రవర్తించాడు. బతిమాలో, బుజ్జగించో తిరిగి తెచ్చుకోవాలి గానీ ఇదేం పని అని ఈ విషయం తెలిసిన వారు నోరెళ్లబెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. యూపీకి చెందిన అజయ్‌కు పెళ్లై నలుగురు పిల్లలున్నారు. ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చిన అజయ్ మలద్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాపురం పెట్టిన కొత్తలో పెయింటర్‌గా కష్టపడి పనిచేసి.. భార్యాపిల్లలను బాగానే చూసుకున్న అజయ్ రానురాను చెడు అలవాట్లకు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకోవడం, తాగుడుకు బానిస కావడంతో అజయ్ ప్రవర్తనతో అతని భార్య విసిగిపోయింది. కొన్నాళ్లు భరించినా భర్త తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో నలుగురు పిల్లలను తీసుకుని యూపీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. పిల్లల చదువులు పాడు కాకూడదని కొన్ని రోజుల క్రితం 13 ఏళ్ల తన కూతురిని, 8 ఏళ్ల కొడుకును భర్త దగ్గర వదిలి.. స్కూల్‌కు పంపించమని భర్తకు చెప్పి వెళ్లిపోయింది. ఆ సమయంలో కూడా తనతో ఉండాలని అజయ్ బతిమలాడినా అతని భార్య పట్టించుకోలేదు. దీంతో.. అజయ్ రోజురోజుకూ సైకోలా మారిపోయాడు. భార్యపై కోపాన్ని పిల్లలపై చూపించాడు. పిల్లలిద్దరినీ తిట్టి కొట్టి హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే.. తన భార్యను ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని భావించి ఓ నీచమైన కుట్ర పన్నాడు.

  గత శనివారం రాత్రి.. తన 8 ఏళ్ల కొడుకును కింద పడుకోవాలని చెప్పి.. అతనిపై ఓ తెల్లని వస్త్రం కప్పాడు. చనిపోయిన వారికి కప్పినట్టు కప్పి.. ఫోటో తీసి మన పిల్లాడు చనిపోయాడని భార్యకు వాట్సాప్‌లో ఫొటో పంపాడు. అంతటితో ఈ సైకో భర్త ఆగడాలు ఆగలేదు. 13 ఏళ్ల కూతురుని నిద్ర లేపి నట్టింట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి తాడు కట్టాడు. కింద ఒక బకెట్ పెట్టాడు. ఆ బకెట్‌పై ఎక్కి నిల్చోవాలని కూతురికి చెప్పాడు. ఆమె వద్దని చెప్పినా వినకుండా అరిచి కేకలేసి ఆమెను నిల్చోబెట్టాడు. ఆ చీర మెడకు తగిలించుకోవాలని చెప్పాడు. ఆమె భయంతో ‘వద్దు నాన్నా’ అని ఏడుస్తున్నా వినిపించుకోకుండా.. చెప్పినట్టు చేయాలని కేకలేశాడు. దీంతో.. ఆ పాప భయంతో చీరను మెడకు తగిలించుకుంది. అంతటితో అజయ్ ఆగలేదు. కాళ్ల కింద బకెట్‌ను తన్నాలని కూతురిని ఆదేశించాడు. బకెట్‌ను తన్నేయాలని లేకపోతే తానే బకెట్‌ను తంతానని కూతురిని హింసించాడు.

  ఇది కూడా చదవండి: Extremely Sad: ఈమె వయసు 34.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు..

  ఈ దృశ్యాలన్నింటినీ ఫొటోలు, వీడియో తీశాడు. తండ్రి ప్రవర్తనతో షాకైన ఆ పాప భయంతో కేకలేయడంతో ఇరుగుపొరుగు వాళ్లొచ్చి చూసేసరికి ఆ పాప కాళ్ల కింద బకెట్ ఉండటం, పైన చీర మెడకు ఉండటం చూసి నివ్వెరపోయారు. వెంటనే ఆ పాపను కాపాడి, పక్కనే నేలపై తెల్ల వస్త్రం కప్పుకుని పడుకుని ఉన్న పిల్లాడిని రక్షించారు. ఈ సైకో భర్తకు దేహశుద్ధి చేసి భార్యను కాపురానికి తెచ్చుకోవడం చాతకాక ఇవేం పనులని తిట్టిపోశారు. పోలీసులకు సమాచారం అందించడంతో అజయ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Daughter first photo, Husband, Mumbai, Son, Uttarpradesh, Wife

  ఉత్తమ కథలు