Home /News /crime /

THE HUSBAND KIDNAPPED HIS WIFE ALONG WITH HIS FRIENDS FOR NOT COMING HOME IN KHAMMAM PRV

Khammam: స్నేహితులతో కలిసి సొంత భార్యనే కిడ్నాప్​ చేసిన భర్త .. కారణం ఏమిటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కిడ్నాప్​లు అంటే ఆస్తి కోసమో.. డబ్బులు లాగడానికో మరేదైనా తగాదాల కారణంగానో చేస్తుంటారు దుర్మార్గులు.  అయితే ఇక్కడ జరిగిన కిడ్నాప్​ మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. ఓ భర్త తన భార్యను తన స్నేహితులతో కలిసి కిడ్నాప్​ చేశాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

ఇంకా చదవండి ...
    మామాలుగా కిడ్నాప్ (kidnap)​లు అంటే ఆస్తి కోసమో.. డబ్బులు లాగడానికో మరేదైనా తగాదాల కారణంగానో చేస్తుంటారు దుర్మార్గులు.  అయితే ఇక్కడ జరిగిన కిడ్నాప్​ మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. ఓ భర్త (husband) తన భార్య (wife)ను తన స్నేహితులతో కలిసి కిడ్నాప్​ చేశాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఈ ఘటన ఖమ్మం (Khammam)లో చోటుచేసుకుంది. గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన దామల్ల సుధాకర్‌, రజిని దంపతులు వృత్తి రీత్యా హనుమకొండలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు శాంతి హైదరాబాద్‌ (Hyderabad)లో బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది. సెలవులకు ఇంటికి వచ్చిన సమయంలో భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన బాలరాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో గత ఏప్రిల్‌లో రిజిస్టర్‌ వివాహం (Register marriage) చేసుకున్నారు.

    ఎలాగైన భార్యను తీసుకురావాలని..

    కొన్ని నెలల తర్వాత వారి కాపురంలో కలతలు రావడంతో శాంతి (shanti) పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన శాంతి కాపురానికి రాకపోవడంతో పలుమార్లు బాలరాజు భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అన్నడంతో బాలరాజు కోపంతో రగిలిపోయాడు. ఎలాగైన భార్యను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు సుధాకర్‌ కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు తన స్నేహితులతో శాంతిని బలవంతంగా తీసుకెళ్లాడు.

    ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు..

    ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు (kidnap case) కూడా నమోదైంది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటి నుంచి తప్పించుకొని శాంతి పుట్టింటికి చేరుకుంది. నర్సింగ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత పెద్దలతో మాట్లాడి పంపిస్తామని ఆమె తల్లిదండ్రులు బాలరాజుకు నచ్చజెప్పారు. బుధవారం కుటుంబసభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న శాంతిని బాలరాజు అడ్డగించాడు. స్నేహితులతో కలిసి రెండు కార్లలో వచ్చిన అతడు అత్త రజిని, బావమరిది సృజన్‌ను పక్కకు నేట్టేసి కార్‌లో తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో శాంతి తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

    ఇవి కూడా చదవండి: honey trap:  తొమ్మిదో తరగతి బాలుడితో లైంగిక సంబంధం.. ఆపై వీడియో తీసి కిలాడీ ఏం చేసిందంటే..

    సంగారెడ్డిలో దారుణం.. 15 నెలల చిన్నారి, పదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకిన తల్లి.. 


    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Khammam, Kidnap, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు