పెళ్లి తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు.. అనుమానంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో షాకింగ్..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఓ తండ్రి అందరిలాగానే తన కూతురును అపురూపంగా పెంచాడు. ఆమెకు కావాల్సినవి అన్నీ తెచ్చి ఇచ్చాడు. ఈ మధ్యన అతడు తన కూతురుకు పెళ్లి (Marrige) చేసి అత్తారింటికి పంపించాడు. ఆమె అత్తగారింటికి వెళ్లిన దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. అల్లుడికి ఫోన్ చేసి తన కూతురును ఇంటికి పంపించమని అడగ్గా వారు ససేమిరా అన్నారు. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

 • Share this:
  ఓ తండ్రి అందరిలాగానే తన కూతురును అపురూపంగా పెంచాడు. ఆమెకు కావాల్సినవి అన్నీ తెచ్చి ఇచ్చాడు. దాదాపు ఆరు నెలల క్రితం కట్న కానుకలు(Dowry) ఇచ్చి తన కూతురుకు వివాహం చేశారు. ఆ రెండు రోజులు తన పుట్టింట్లోనే ఉన్న ఆ నవ దంపతులు మూడో రోజు అత్తగారింటికి వెళ్లారు. వెళ్లిన దగ్గర నుంచి కూతురు(Daughter) నుంచి ఎలాంటి ఫోన్లు రాలేదు. కనీసం వీళ్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో కంగారు పడిపోయిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌(Uttarapradesh)లోని ఉన్నావో లోని థానా(Thana) గ్రామానికి చెందిన పరమేశ్ అనే వ్యక్తికి ఒక కూతురు ఉంది. ఆమెను ఆరు నెలల క్రితం అనిల్(Anil) అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అత్తింటివాళ్లు అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.

  Crime News: దొంగతనానికి వచ్చారు.. యజమాని చేతిలో రూ.500 పెట్టి.. చివరకు ఏం చేశారో తెలుసా..

  తర్వాత అతడి కూతురును అల్లుడితో పాటే అత్తారింటికి పంపించాడు. వెళ్లేటప్పడు వారిద్దరు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెళ్లిన దగ్గర నుంచి తన కూతరు వద్ద నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. అతడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అత్తింట్లో ఫోన్ (Mobile) మాట్లాడటం ఇష్టం ఉండదేమో అని అనుకున్నాడు. అందువల్లనే తన కూతురు అలా చేస్తుందని భావించాడు. నాలుగు రోజులు ఇంట్లో ఉండి.. మళ్లీ మీ ఇంటికి పంపిస్తా.. తన కూతురును పంపమని అల్లుడికి ఫోన్ చేశాడు. అయినా అతడు కుదరదని చెప్పాడు.

  టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లిన బాలిక.. చాక్లెట్ ఆశ చూపి బెడ్రూంకి తీసుకెళ్లిన యువకుడు.. తర్వాత ఆ బాలికపై బలవంతంగా..

  అంతేకాకుండా.. తామన్న మీ ఇంటికి వస్తాం అని అన్నాడు. దానికి వారు కుదరనే కుదరదు అన్నాడు. ఎందుకు వీళ్లు ఇలా చేస్తున్నారు.. కూతురుతో మాట్లాడితే తప్పేంటి.. అనే సందేహం అతడికి మొదలైంది. ఆ సందేహంతో పాటు అనుమానం కూడా వచ్చింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయాన్ని పరమేశ్ పోలీసులకు వివరించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  సమయం మధ్యాహ్నం 2.30 నిమిషాలు అవుతుంది.. మూడో తరగతి చదువుతున్న బాలిక.. ఎంత పని చేసిందంటే..!

  ఇక దర్యాప్తులో భాగంగా అనిల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఆ కొత్త పెళ్లి కూతురును నాలుగు నెలల క్రితమే చంపేసినట్లు అతడు పోలీసులకు వివరించాడు. విషయం తెలుసుకున్న తండ్రి పరమేశ్ గుండె బరువెక్కింది.

  Crime News: అదనపు కట్నం తేవాలంటూ.. కట్టుకున్న భర్త ఎంత పని చేశాడో తెలుసా.. ఆ వీడియోలు, ఫొటోలను

  పోలీస్ స్టేషన్ లోనే కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ మృతదేహాన్ని ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ అడవిలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ స్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆ ప్రదేశంలో తవ్వించి ఆ మృతదేహాన్ని బయటకు తీయించి.. పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
  Published by:Veera Babu
  First published: