ఓ వ్యక్తి చేపల చెరువు వద్ద పిట్టలు వెళ్లగొట్టే కాపలా పని చేస్తుంటాడు. అందులో భాగంగానే అతడి వెంట పిట్టలను కాల్చేందుకు నాటు తుపాకీ వెంట ఉంటుంది. ఏమైందో.. ఏమోగానీ ఉన్నట్టుండి నాటు తుపాకీ పేలి ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన నక్కలవెల్లి రాజా కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్లపాడులో చేపల చెరువు వద్ద పిట్టలు తోలేందుకు కాపలా పనికి కుదిరాడు. నాలుగు నెలలుగా చేపల చెరువు వద్ద పిట్టలు కొడుతూ ఉన్నాడు. అయితే నాటు తుపాకీ పేలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gun fire, Krishna District