హోమ్ /వార్తలు /క్రైమ్ /

Auto Driver: ఆటో డ్రైవర్‌ను లవ్ చేసిన యువతి.. చివరకు అతనికి పట్టింది ఈ గతి.. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది..

Auto Driver: ఆటో డ్రైవర్‌ను లవ్ చేసిన యువతి.. చివరకు అతనికి పట్టింది ఈ గతి.. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది..

పోలీసుల అదుపులో సోనియా, ఆమె బావ

పోలీసుల అదుపులో సోనియా, ఆమె బావ

దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు ఆడవాళ్లు కూడా హత్యలు, మోసాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఒక నేరం చేస్తే తరువాత పరిణామాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.

గురుగ్రామ్: దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు ఆడవాళ్లు కూడా హత్యలు, మోసాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఒక నేరం చేస్తే తరువాత పరిణామాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ ఘటనే గురుగ్రామ్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రియుడితో గొడవ పడిన ఓ యువతి క్షణికావేశంలో అతని ప్రాణాలు తీసింది. ఈ హత్యకు ఆమె బావ కూడా సహకరించాడు. ఇద్దరూ ప్రస్తుతం జైలుపాలయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సోనియా, ఆసిఫ్ 2018 నుంచి స్నేహంగా ఉంటున్నారు. ఆసిఫ్ ఆటో డ్రైవర్. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. అయితే.. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సోనియా ఆసిఫ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని ఆసిఫ్‌కు చెప్పింది. ఈ విషయంలో సోనియా మాటను ఆసిఫ్ నిర్లక్ష్యం చేశాడు. సోనియా ఆసిఫ్‌ను కలవడానికి జలంధర్ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఒంటరిగా వెళ్లకుండా తన బావను వెంటబెట్టుకుని వెళ్లింది. ముగ్గురూ కలిసి ఘటా అనే గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం సేవించారు. బీర్లు తాగాక ఆసిఫ్, సోనియా విచక్షణ కోల్పోయి గొడవపడ్డారు. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది.

క్షణికావేశంలో ఇనుప రాడ్లు, రాళ్లతో కొట్టి సోనియా, ఆమె బావా కలిసి ఆసిఫ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతటితో ఈ బావామరదలు ఆగలేదు. ఇనుప రాడ్, బండరాయితో దాదాపు 12 సార్లు ఆసిఫ్‌ను కిరాతకంగా తలపై, ముఖంపై కొట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటా గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇద్దరూ ఆసిఫ్‌పై దాడి చేయడం చూశాడు. భయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఇది కూడా చదవండి: Sad: తండ్రి ఒడిలోని పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.. కాసేపటికి ఏడుపు ఆగిపోయింది.. ఏమైందా అని తల్లి వెళ్లి చూడగా..

పోలీసులకు స్పాట్‌కు చేరుకునే సరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆసిఫ్ రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆసిఫ్ వయసు 25 సంవత్సరాలు. అతని స్వస్థలం యూపీలోని బుడున్ జిల్లాగా పోలీసులు తెలిపారు. తప్పించుకుని పోయిన సోనియాను, ఆమె బావను పోలీసులు ఈ ఘటన జరిగిన మూడు గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారు. క్షణికావేశంలో సోనియా చేసిన హత్య ఆమె జీవితాన్ని నాశనం చేసింది. చివరకు కటకటాల పాలు చేసింది.

First published:

Tags: Brutally murder, Crime news, Gurugram, Haryana, Lover, Lovers, Uttar pradesh

ఉత్తమ కథలు