హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love Marriage: వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. ఆమె మేనమామకు ఈ సంగతి తెలిసి..

Love Marriage: వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. ఆమె మేనమామకు ఈ సంగతి తెలిసి..

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట

బారాబంకి జిల్లాలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రారియా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. ఆ యువకుడు కూడా ఆమెతో ప్రేమలో ఉన్నాడు. ఆ యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వాళ్ల ఊరయిన రారియాలోనే ఉంటోంది.

ఇంకా చదవండి ...

బారాబంకి: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ యువతి మేనమామ ఆ యువతికి ఊహించని శిక్ష వేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరినీ ఊరి మధ్యకు తీసుకువచ్చి ఇద్దరినీ కట్టేసి కొట్టాడు. ఆ యువతికి గుండు కొట్టించి ఊరంతా తిప్పాడు. ఈలోపు.. పోలీసులు సీన్‌లోకి ఎంటర్ కావడంతో ఆ యువతి మేనమామను, ఈ ఘటనకు బాధ్యులైన మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి పరిధిలోని ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బారాబంకి జిల్లాలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రారియా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. ఆ యువకుడు కూడా ఆమెతో ప్రేమలో ఉన్నాడు. ఆ యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వాళ్ల ఊరయిన రారియాలోనే ఉంటోంది. అదే సమయంలో.. తల్లిదండ్రులను కోల్పోయిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఆ యువకుడు ఊళ్లోనే కష్టపడి పనిచేసుకుంటూ తనకు ఉన్న ఇంట్లోనే ఉండేవాడు. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ మేజర్లే కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. ఇద్దరి కులాలు వేరు కావడంతో.. ఆ విషయం ఆమె మేనమామకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోడని భావించి.. ఇద్దరూ అదే ఊరిలో దేవుడికి మొక్కుకుని పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సదరు యువతిని ఆ యువకుడు భార్యగా స్వీకరించి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ పెళ్లి గురించి యువతి మేనమామకు, బంధువులకు తెలిసింది. ఆ యువకుడి ఇంట్లో ఉన్న ఆ యువతిని బలవంతంగా ఊరి మధ్యలోకి లాక్కొచ్చి ఇద్దరినీ ఆమె మేనమామ చితకబాదాడు. అంతటితో ఆగక.. ఆ యువకుడిని చెట్టుకు కట్టేసి.. యువతికి గుండు గీయించాడు. ఊరంతా తిరిగి తాను ఈ పెళ్లి చేసుకోవడం తప్పని.. కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పు అని చెప్పాలని ఆ యువతికి మేనమామ హుకుం జారీ చేశాడు. దీంతో.. ఆ యువతి చేసేదేమీ లేక మేనమామ చెప్పినట్టే చేసింది.

ఇది కూడా చదవండి: Vismaya: ఈ బంగారు తల్లి విస్మయ.. ఏ స్థితిలో చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

అయితే.. గ్రామస్తుల్లో ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె మేనమామ చేసిన పనికి బ్రేక్ పడింది. ఈ ఘటనకు బాధ్యులైన ఆ యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బారాబంకి ఎస్పీ డాక్టర్ అవదేష్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన యువతి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిపై ఆ బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.

First published:

Tags: Crime news, Love marriage, Lovers, Shocking desicion, Uttar pradesh

ఉత్తమ కథలు