బాలికపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించి..

అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించారు.

news18-telugu
Updated: May 23, 2020, 4:33 PM IST
బాలికపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజురోజూకీ సమాజంలో కామంధుల దుశ్చర్యలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. అభంశుభం తెలియని బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఓ నలుగురు యువకులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నవీన్, రమేశ్, శంకర్, అనిల్ అనే నలుగురు యువకులు అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించారు. కానీ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో యువకుల అకృత్యం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading