Doctor and Compounder: మహిళా డాక్టర్ ను ప్రేమించిన కంపౌండర్.. ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఆమెను ఏం చేశాడంటే..

డాక్టర్ కు సింధూరం దిద్దిన కంపౌండర్ (Image credit : twitter)

Doctor and Compounder: ఒక ఆసుపత్రిలో కంపౌండర్ గా పనిచేసే అతడు.. అందులో డాక్టర్ ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ప్రవర్తన మంచిగా లేదని ఆ డాక్టర్ అతడిని ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో పగ పెంచుకున్న సదరు వ్యక్తి ఆ డాక్టర్ ను ఏం చేశాడంటే..

  • Share this:
    అతడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కంపౌండర్ గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ పనిచేస్తున్న మహిళా డాక్టర్ ను ఈ యువకుడు ప్రేమించాడు. మొదటి నుంచి ఆమె వెంట పడటం మొదలు పెట్టాడు. తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినకుండా అతడు ఆమె వెంట పడేవాడు. ఓ రోజు అతడి ప్రవర్తనతో విసుగుచెంది ఆమె ఉద్యోగం నుంచి తీసేసింది. ప్రవర్తన మంచిగా లేకపోవడంతో కంపౌండర్ జాబ్ నుంచి తీసేసినట్లు సదరు వ్యక్తికి ఆమె చెప్పింది. రేపటి నుంచి డ్యూటీకి రావాల్సిన అవసరం లేదని చెప్పడంతో అతడు కోపంతో ఊగిపోయాడు. ఏం చేయాలో అర్థంకాక అతడు.. ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా మహిళా డాక్టర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ఉద్యేశ్యంతో మహిళా డాక్టర్ ఉంటున్న చాంబర్ లోకి ఓరోజు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. చాంబర్ గడియ పెట్టి ఆమె నుదుటన సింధూరం దిద్దాడు. ఈ ప్రక్రియను అంతా అతడు తన మొబైల్ లో వీడియో తీశాడు.

    అంతేకాక ఆమెతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళా డాక్టర్ ఆ కంపౌంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. దీనిక సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు.  బీహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలోని దల్‌సింగ్‌సరాయ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సుమిత్ కుమార్ కంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. అందులో ఓ మహిళా డాక్టర్ దల్‌సింగ్‌సరాయ్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తూనే, ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కంపౌండర్ గా సుమిత్ కుమార్ ను కొన్ని నెలల క్రితం నియమించింది. అయితే అతడి ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడటంతో ఆమె ఉద్యోగంలోంచి తీసేసింది.

    దీంతో ద్వేషం పెంచుకున్న ఆ కంపౌండర్ మహిళా డాక్టర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆసుపత్రిలోని డాక్టర్ చాంబర్‌లోకి చొరబడ్డాడు. అక్కడి మహిళా డాక్టర్ అతనికి ఏదో చెప్పబోతున్నంతలోనే ఆమె నుదుటన సింధూరం దిద్దాడు. ఈ ఉదంతాన్ని వీడియో తీశాడు. అలాగే ఫొటోలు కూడా తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వ్యవహారం వైరల్ కావడంతో సదరు మహిళా డాక్టర్ ఆ కంపౌంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన సుమిత్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: