Home /News /crime /

THE FATHER WHO STRANGLED THE CHILDREN BECAUSE HE SUSPECTED THAT THEY ARE NOT HIS BIOLOGICAL CHILDREN PRV

OMG: ఇంతటి దారుణమా? ఇద్దరు పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానంతో గుట్టపైకి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనుమానం పెనుభూతమైంది. ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.  నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లాలోని కోడేరు మండలం ఎత్తం గ్రామంలో బుధవారం నాడు ఈ విషాదం చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India
    అనుమానం పెనుభూతమైంది. ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.  నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లాలోని కోడేరు మండలం ఎత్తం గ్రామంలో బుధవారం నాడు ఈ విషాదం చోటు చేసుకుంది. కొడుకు, కూతురు గొంతు కోశాడు తండ్రి. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గొంతు కోసుకొని (Suicide) ప్రాణపాయస్థితిలో ఉన్న ఒంకార్ ను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కుడికిల్లకు చెందిన ఓంకార్‌కు అదే గ్రామానికి చెందిన మహేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మల్లేశ్వరి ఓంకార్‌కు మూడోభార్య. మల్లేశ్వరి సైతం ఓంకార్‌ను రెండో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు చందన (3), విశ్వనాథ్‌ (1) ఉన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయిస్తానంటూ నమ్మబలికిన ఓంకార్‌ ఇద్దరు పిల్లలు, భార్యను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు.

    ఇద్దరు పిల్లలను గుట్టపైకి తీసుకెళ్లి..

    కొల్లాపూర్‌ (Kolhapur) నుంచి పెద్దకొత్తపల్లి దారిలో వస్తుండగా, భార్యభర్తలిద్దరికీ గొడవ జరిగింది. చంపుతానంటూ బెదిరించడంతో మహేశ్వరి ద్విచక్ర వాహనం నుంచి కిందకు దూకింది. ఓంకార్‌ ఇద్దరు పిల్లలతో కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్ట వద్దకు వెళ్లాడు. బైక్​ని సమీపంలోని పొలం వద్ద వదిలేసి ఇద్దరు పిల్లలను గుట్టపైకి తీసుకుపోయాడు ఓంకార్​.  ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి తన పిల్లల గొంతు కోశాడు. అనంతరం తానూ గొంతుకోసుకొని కిందకు వచ్చి రోడ్డుపై పడిపోయాడు ఓంకార్​. ఇక భార్య మహేశ్వరి పారిపోయి పెద్దకొత్తపల్లి ఠాణాలో పోలీసులను ఆశ్రయించింది. భర్త ఇద్దరు పిల్లలను తీసుకెళ్లాడని వారిని చంపుతానని బెదిరించాడని తెలిపింది.



    ఓంకార్‌ మొబైల్​ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గుట్టపై ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలం వద్ద కత్తి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఓంకార్‌ను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఓంకార్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది.

    నల్గొండలో అనుమానంతో..

    ఇటీవలె నల్గొండలో ఇలాంటి ఘటనే జరిగింది. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే 29 సంవత్సరాల వ్యక్తి అదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఒక పాప, ఓ బాబు ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఆరేళ్లుగా కాపురం సాఫీగానే సాగుతోంది. నకిరేకల్‌లోని పన్నాలగూడెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఏడాది నుంచి శ్రీకాంత్ భార్య స్వాతికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. భార్యపై అనుమానాలు మొదలయ్యాయి. అదే విషయంలో తరచూ గొడవపడుతూ వస్తున్నారు.

    రెండ్రోజుల క్రితం స్వాతి, శ్రీకాంత్ ఉదయం పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత మరోసారి గొడపడ్డారు. అదే సమయంలో సహనం కోల్పోయిన శ్రీకాంత్‌ భార్యను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత 9.30 గంటల సమయంలో నకిరేకల్‌లోనే ఉంటున్న స్వాతి అక్క పల్ల స్వప్నకు శ్రీకాంత్‌ ఫోన్‌ చేసి మీ చెల్లెను చంపేశానని చెప్పి ఇంట్లోంచి పారిపోయాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Burtally murder, Crime news, Nagarkurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు