కన్న కూతురుపై అత్యాచారం చేయబోయాడు.. కానీ ఆమె ఇలా చేస్తుందని ఊహించలేకపోయాడు.. ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: కన్న తండ్రే కుమార్తె పట్ల కిరాతకుడిగా మారాడు. కుమార్తె అని కూడా చూడకుండా తన వాంఛ తీర్చాలని విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. చివరకు కుమార్తే అతడిని హతమార్చింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.

  Crime News: కిటికీ అద్దం పగలకొట్టారు.. దానికి కారణం ఎవరనే తేల్చుకునే పనిలో ఇలా జరిగింది..


  ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వయువరసలు మరిచి కన్న కూతురు, వరుసకు చెల్లి, అక్కడ అయిన వారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడు లో చోటు చేసుకుంది. కన్న తండ్రే కుమార్తె పట్ల కిరాతకుడిగా మారాడు. కుమార్తె అని కూడా చూడకుండా తన వాంఛ తీర్చాలని విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. చివరకు కుమార్తే అతడిని హతమార్చింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇలా తెలిపారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ దివ్యాంగుడు. కొన్ని రోజుల క్రితం తన భార్య చనిపోయింది.

  Women Sarpanch: ఆ గ్రామంలో అతడు చేసిన పనికి.. మహిళా సర్పంచ్ ఎంత పని చేసిందో తెలుసా..


  అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కలిసి ఒకు దగ్గర ఉంటున్నారు. వెంకటేశ్‌ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దానికి సంబంధించి వెంకటేష్ నామినేషన్  దాఖలు చేయడానికి వెళ్లి వచ్చాడు. వెంకటేష్ ఇంటికి తన బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో సీన్ చూసి షాక్ అయ్యారు. అక్కడ వెంకటేష్ విగత జీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు.

  Car Driver: డ్రైవర్ కదా అని నమ్మాడు.. చివరకు యజమానికి టోపీ పెట్టేశాడు.. ఏమైందంటే..


  వెంకటేశ్‌ రెండో కుమార్తె తండ్రిని హత్య చేసిందని అనంతరం దర్యాప్తులో గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆమె ఇలా చెప్పింది. ‘తన తండ్రి నాపై అత్యాచారం చేయబోయాడు.. తన ఆత్మరక్షణ కోసమే అతడిని చంపేశాను’ అంటూ  చెప్పింది. ఈ వివరాలను డీఎస్పీ ఇళంగోవన్‌ వెల్లడించారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసమే అతడిని ఆమె హత్య చేసిందని.. ఆమెను తక్షణమే విడుదల చేయాలని వల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
  Published by:Veera Babu
  First published: