వధువు తల్లితో వరుడి తండ్రి అక్రమ సంబంధం....పెళ్లి రోజే...

గతవారం పెళ్లి జరగాల్సి ఉండగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు మునిగిపోయాయి. అయితే, సరిగ్గా అప్పుడే జరిగిందో విస్తుపోయే సంఘటన. వధువు తల్లి అదృశ్యమైంది.

news18-telugu
Updated: May 29, 2020, 4:25 PM IST
వధువు తల్లితో వరుడి తండ్రి అక్రమ సంబంధం....పెళ్లి రోజే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బీహార్ లోని చంపారన్ జిల్లాలో జరిగిన ఘటన మానవ సంబంధాలకు మాయని మచ్చగా నిలిచింది. పిల్లల పెళ్లికి ముందు వధువు తల్లి, వరుడి తండ్రి పరారయ్యారు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. చంపారన్ ప్రాంతానికి చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గతవారం పెళ్లి జరగాల్సి ఉండగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు మునిగిపోయాయి. అయితే, సరిగ్గా అప్పుడే జరిగిందో విస్తుపోయే సంఘటన. వధువు తల్లి అదృశ్యమైంది. ఆమె కనిపించకుండా పోవడంతో అందరూ ఆమె కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో వరుడి తండ్రి కూడా కనిపించకుండా పోయాడు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆరా తీయగా తెలిసిందేమిటంటే.. వారిద్దరూ కలిసి జంపైపోయారని. వారిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా, వారిద్దరూ పరారు కావడంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది.
First published: May 29, 2020, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading