(K. Veeranna News 18, Medak)
రెక్కాడితేగాని బ్రతకాని జీవితాలు వారివి. బంధువుల ఇంట జరిగే సంవత్సరీకం కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి గురువారం ఆటోలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. అలిరాజపేట పరిసరాల్లోని కూడవెల్లి వాగు వంతెన దాటిన అనంతరం చిన్న మూలమలుపులో ఆటోను కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలోని ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. దీంతో ఒకే కుటుంబానికి (Family members)చెందిన కవిత, చంద్రయ్య, లలిత. డ్రైవ కనకయ్య దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబంలోనే కాదు ఊరంతా తీరని విషాదం నింపింది. లక్ష్మి, కనకవ్వకు కాళ్లు, చేతులు విరిగాయి. ఈ సంఘటన (family died) పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.
దినసరి కూలీలు..
వారంతా దినసరి కూలీ పనులు, కూరగాయలు, మక్క కంకుల విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి సంపాదన పైనే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. శ్రీగిరిపల్లి కనకయ్య ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడు ఆటోను కిరాయికి తీసుకొని నిత్యం సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ నుంచి జగదేవపూర్ మధ్య ప్రయాణికులను చేరవేస్తాడు. అతని మృతితో భార్య, కుమారుడు, కుమార్తె రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.
ఒకే రోజు గ్రామంలో నలుగురు మృతి..
కొంతం చంద్రయ్య.. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయాడు. భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో మహిళ కొట్టాల లలితకు ఇద్దరు కుమార్తెలు. ఆమె కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈమె తోటి కోడలైన కొట్టాల కవితకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రజ్ఞాపూర్‌లోని రాజీవ్ రహదారిపై మక్కజొన్న కంకులు విక్రయిస్తూ భర్తకు చేదోడుగా నిలిచేది. ఒకే రోజు గ్రామంలో నలుగురు మృతి చెందడంతో (family died) విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎల్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గురువారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ..
ఖమ్మంలోనూ (Khammam) ఇలాంటి ఘటనే జరిగింది. బంధువుల ఇంట్లో కర్మకాండలకు ఆటోలో వెళ్లి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి సమీపాన గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(60), ఆమె కుమారుడు ఉపేందర్, మనవడు హర్షవర్ధన్ (6) ఆటోలో ఖమ్మం అర్బన్ మండలం ఏదులాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండలకు హాజరై తిరుగు పయనమయ్యారు.
వీరి ఆటో గోకినేపల్లి సమీపానికి చేరుకోగానే కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న భారతమ్మ, ఆమె మనవడు హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉపేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారతమ్మ తల తెగిపడింది. కాగా, మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ఆటోఎక్కిన కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చాగంటి రమేశ్ (36) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gajwel, Medak, Road accident, Siddipet