THE FAKE BABA RAPED THE GIRL VILLAGERS HANDED OVER TO POLICE IN NIRMAL DISTRICT VB ADB
Telangana: నమ్మి ఆశ్రయమిస్తే బాలికపై అఘాయిత్యం.. అతడిపై గ్రామస్థుల దేహశుద్ది.. స్పృహ కోల్పోయిన ఆ బాలికను..
దొంగ బాబా ఆశ్రమం
Telangana: నమ్మి ఆశ్రయిమిస్తే భక్తి ముసుగులో ఓ మైనార్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన దొంగబాబాకు తాండవాసులు దేహశుద్ది చేసిన పోలీసులకు పట్టించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన జాదవ్ ఆత్మారాం మహారాజ్ ఆరెళ్ళ క్రితం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల రాజారాకు వచ్చి స్థిరపడ్డారు. అతని మాటలు నమ్మి రాజారా గ్రామస్థులు ఆశ్రయం కల్పించడంతో రాజారా సమీపంలో కొండపై ఉన్న శివాలయంలో పూజారిగా ఉంటూ పూజలు చేస్తుకుంటూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం తీసుకోకుండా పండ్లు తింటూ, నీళ్ళు తాగుతూ ఉండేవాడు. దీంతో ఆ బాబాను దైవ స్వరూపంగా భావించి తండవాసులు పండ్లు, ఫలహారాలు తెచ్చి ఇచ్చేవారు. ఇలా గ్రామస్థులకు బాబాపై నమ్మకం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల్లో పూజలు చేసేవాడు. అయితే ఎండాకాలం కొండపై నీళ్ళకు ఇబ్బంది కావడంతో మరో ఆలయం పక్కన రెండేళ్ళుగా ఉంటున్నాడు.
అయితే రాజురాకు చెందిన 16 ఏళ్ళ మైనర్ బాలిక బాబాకు నీళ్ళు, ప్రసాదం ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు ఆ బాబా వక్రబుద్దితో ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి వెళ్ళిన తమ కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానంతో బాలిక తల్లిదండ్రులు బాబా ఇంటికి వెళ్ళారు. తలుపులు మూసి ఉండడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తల్లిదండ్రులకు స్పృహ కోల్పోయిన స్థితిలో బాలిక కనిపించింది.
బాలిక ద్వారా లైంగింక దాడి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు బాబాకు దేహ శుద్ది చేసి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దొంగబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ. తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.