THE DRUNKEN WIFE DRANK HEAVILY THAT DAY THEN KILLED HER HUSBAND TELLING HER MOTHER IN LAW I KILLED YOUR SON NK
మద్యం మత్తులో భర్తను చంపిన భార్య... ఆ విషయంలో తేడా వచ్చింది!
ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)
ఆమె మద్యం మామూలుగా తాగలేదు... ఫుల్లుగా పీకలదాకా తాగింది. తర్వాత భర్తను చంపేసింది. ఆ తర్వాత అత్తగారికి కాల్ చేసి... "నీ కొడుకును లేపేశా" అంది... అసలెందుకిలా చేసిందో తెలుసా?
భర్తను కోల్పోయిన కాంతాను... నాథూ యాదవ్... 6 నెలల కిందట పెళ్లి చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని ముంగెడ్ అనే గ్రామంలో కాపురం పెట్టాడు. అద్దె ఇంట్లో ఉండేవారు ఇద్దరూ. నాథూయాదవ్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగాడు. ఐతే... ఓ రోజు అత్తగారి ఇంటికి వెళ్లిన కోడలు.. ఏదేదో చెప్పి... తర్వాత కనిపించకుండా పోయింది. అదే ఈ కథలో టర్నింగ్ పాయింట్ అయ్యింది. జనరల్‌గా ఏ వివాహిత అయినా తన పసుపుకుంకుమలు చల్లగా ఉండాలనీ... తను సుమంగళిగా ఉండాలని పూజలు, వ్రతాలు చేస్తుంది. రాజస్థాన్... దంగార్పూర్ జిల్లాలో మాత్రం పూర్తి విరుద్ధంగా జరిగింది. అక్కడ జరిగిన ఘటన స్థానికుల్ని షాకయ్యేలా చేసింది. పీకల దాకా తాగిన భార్య... భర్తను చంపేసింది. తర్వాత అత్తగారి దగ్గరకు వెళ్లి... "నేను నీ కొడుకును చంపేశా. ఇకపై నేను కూడా నీతోనే ఈ ఇంట్లో ఉంటా" అంది. అత్తగారికి మైండ్ బ్లాంక్ అయ్యింది.
ఇంట్లోనే 4 రోజులుగా శవం:
ఈ కేసు స్థానిక సబ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది. ఇక్కడ భర్త నాథూ యాదవ్‌ను భార్య కాంతా చంపేసింది. ఆగస్ట్ 23న ఈ ఘటన జరిగింది. తాను ఏం చేసింది 65 ఏళ్ల అత్తగారు బేవా గులాబ్ యాదవ్‌కు క్లియర్‌గా చెప్పింది. కోడలు అలా చెప్పినా... అత్త నమ్మలేదు. ఏదో తనను భయపెట్టడానికి అలా అంది అనుకుంది. నాలుగు రోజుల తర్వాత... ఇంటి పక్కింటి వారికి కుళ్లు వాసన రావడంతో... వాళ్లు కాంతాకు ఫోన్ చేశారు. ఆ కాల్‌ను అత్తగారికి ఇచ్చి మాట్లాడమంది. వాళ్లు చెప్పింది విన్నాక... అప్పుడు అత్తకు డౌట్ మొదలైంది. వెంటనే కొడుకు ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లి తాళం తెరచి చూడగా... ఆ రూంలో కొడుకు శవం కుళ్లిపోయి కనిపించింది. భరించలేని వాసన వచ్చింది. వెంటనే తలుపు వేసేసి... పోలీసులకు కాల్ చేసింది. కోడలే చంపేసిందని కంప్లైంట్ ఇచ్చింది.
ఇదీ సమస్య:
ఆల్రెడీ పెళ్లై... భర్తను కోల్పోయిన అమ్మాయిని తన కొడుకు చేసుకోవడం అత్తకు ఇష్టం లేదు. అందువల్ల కోడలు తనతో ఉండటానికి వీల్లేదని అంది. తల్లిని ఎదిరించని నాథూయాదవ్... తన భార్యను అద్దె ఇంట్లో ఉంచాడు. అది ఆమెకు నచ్చలేదు. తనకు అవమానం జరిగినట్లు ఫీలైంది. రోజూ అదే తలచుకుంటూ పచ్చి కోపంతో ఊగిపోయేది. ఆ క్రమంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మద్యం తాగడం మొదలుపెట్టింది. అయినా మార్పు రాలేదు. పైగా కొత్తగా మద్యానికి బానిసైంది. నానాటికీ ఆమెలో అత్తపై కోపం, భర్తపై అసహనం ఎక్కువయ్యాయి. ఆ క్రమంలో తాజాగా భర్తను చంపేసింది. అలాగే కోపంతోనే వెళ్లి అత్త ఇంట్లో సెటిలైంది. తీరా అత్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాక... ఇంట్లోంచీ పారిపోయింది.
హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కోడలి కోసం వెతుకుతున్నారు. మద్యం మత్తులోనే తాను హత్య చేశానని అత్తకు చెప్పడంతో... అలాగే చేసి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. పోలీసులు మాత్రం... పోస్ట్ మార్టం తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి అంటున్నారు. శవాన్ని నానా ఇబ్బందులు పడి ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ఇలా భార్యే భర్తను చంపడం, శవాన్ని ఇంట్లోనే ఉంచడం అన్నీ స్థానికులకు హర్రర్ పిక్చర్ చూసినట్లు అనిపించాయి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.